ISRO: 50ఉపగ్రహాలను 5ఇయర్స్ లో ప్రయోగిస్తామన్న ఇస్రో ఛైర్మన్.
ఈ విశ్వం నుంచి భూమి పుట్టినప్పటినుంచి ఎన్నో రకాలమార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే, ఈ పుడమి పైన మనిషి ఉనికి ఏర్పడిన తరవాత ఎన్నో రకాల పరిశోదనలు మొదలైయ్యాయి.
ఈ పరిణామ క్రమంలో ఎన్నో మానవ మెదళ్ల అనుభవాలనుంచి కొత్త కొత్త ఇన్నోవేషన్ లు అకురించాయి.ఈ భూగోళం పైన నిఘా సామర్థ్యాలను పెంచే దిశ వైపు భారత్ అడుగులు వేస్తోంది.
దీనికోసం రాబోయే ఐదు సంవత్సరాలలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు.
మహారాష్ట్రలోని ముంబయిలో ఐఐటీ బాంబే లో నిర్వహించిన ‘టెక్‌ఫెస్ట్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో పొరలుగా ఉంచడం ద్వారా బలగాల కదలికలపై నిశితంగా పరిశీలించవచ్చని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. దీని ద్వారా వేల కిలోమీటర్ల వైశాల్యంలో పర్యవేక్షణ కొనసాగించొచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ విశ్వం లో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించేలా ఉపగ్రహాల సామర్థ్యాలను మెరుగుపరచడం, డేటా విశ్లేషణకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించడం కీలకమని వెల్లడించారు.
భారీ స్థాయిలో శాటిలైట్‌లను ప్రయోగించగలిగితే దేశానికి ముప్పును తగ్గించొచ్చని తెపారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబరులో ప్రతిపాదించిన ‘జీ20’ ఉపగ్రహానికి పేలోడ్‌లు,
సాధనాలు అందించడం ద్వారా తమవంతు సహకారం అందించాలని జీ20 కూటమి సభ్యదేశాలకు సోమనాథ్ పిలుపునిచ్చారు. రానున్న రెండేళ్లలో దాన్ని ప్రయోగిస్తామని తెలిపారు.జనవరి 6న ఆదిత్య ఎల్-1 గమ్యస్థానానికి చేరుకుంటుందని వివరించారు.
సూర్యుడి గురించి అధ్యయనం కోసం భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య L1 తన పయణంలో తుది దశకు చేరువైందని,
జనవరి 6న సాయంత్రం 4గంటలకు తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్‌కు ఆదిత్య L1 చేరుకుంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.
ఇటీవల ఓ ఎన్జీఓ నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు.
ఐదేళ్లపాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపయోగ పడే సమాచారాన్ని ఆదిత్య L1 సేకరిస్తుందని, సూర్యుడిలో వచ్చే మార్పులు మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తాయని వెల్లడించారు. అలాగే, భారత స్పేస్ స్టేషన్‌ను నిర్మించేందుకు ఇస్రో ప్రణాళికను కూడా సిద్ధం చేసిందని వెల్లడించారు.