SRO XPoSat Mission: నూతన సంవత్సరం రోజున ఇస్రో అద్భుతం.

ISRO's miracle on New Year's Day.

SRO XPoSat Mission: చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుని పైకి చేరుకున్న భారత్ 2023 లో అత్యంత పెద్ద ఘనత సాధించింది అని చెప్పాలి.

ఈ మిషన్ విజయవంతం అయిన సమయంలో భారత ప్రధాన మంత్రి నుండి సామాన్య పౌరుడివరకు ప్రతి ఒక్కరు ఎంతగానో సంతోషించారు. అదే ఉత్సాహంలో మన భారత శాస్త్ర వేత్తలు సూర్యుడిపై కూడా పరిశోధనలు జరపాలని భావించారు.

అందులో భాగంగానే ఆదిత్య ఎల్ 1 అనే మిషన్ ను ప్రయోగించారు. మరి 2024 కొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఇస్రో శాస్త్రవేత్తలు నూతన సంవత్సరం రోజున హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఇవాళ కూడా ఒక మిషన్ ను ప్రయోగించింది.

ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ ప్రయోగం : Expo Polarimeter Satellite

నేడు ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరి కోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఏడాదికి గాను మొదటి అంతరిక్ష యాత్రను చేపట్టింది.

జనవరి ఒకటవ తేదీన ప్రయోగించిన ఈ మిషన్ పేరు ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్. ఈ ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే,

ఎక్స్ పోసాట్ తో బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ పై అధ్యయనాలు చేస్తారు. ఈ ప్రయోగం వల్ల భారత్ మరో ఘనత సాధించినట్టయింది.

అంతరిక్షంలోకి, ప్రత్యేక ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీని పంపించిన దేశాల్లో రెండవదిగా భారత్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.

మొదట అమెరికా తరువాత భారత్ : First Place Goes To America And Second India

దీనిని హాంతరిక్షంలోకి పంపించడం వల్ల బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటి గురించి మరింత సమాచారం సేకరించడానికి వీలవుతుంది.

మనకన్నా ముందు ఈ ప్రయోగం చేసిన దేశంగా అమెరికా ఒకటవ స్థానంలో ఉంది, అగ్రరాజ్యం అమెరికా 2021 లోనే ఇమేజింగ్ ఎక్స్‌రే పొలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్ అనే ఒక మిషన్ ను ప్రయోగించింది.

ఆ మిషన్ ద్వారానే బ్లాక్ హొల్స్, న్యూట్రాన్ నక్షత్రాల గురించి సమాచారాన్ని అందుకోగలుగుతున్నారు అమెరికా శాస్త్రవెత్తలు.

Leave a Comment