బెంగళూరు సిటీ ని వదిలి వెళ్ళి పోతున్న IT ఉద్యోగులు – కారణం ?

Bengaluru Karnataka India Investment Brief బెంగళూరు సిటీ ని వదిలి వెళ్ళి పోతున్న IT ఉద్యోగులు - కారణం ?

IT employees leaving Bengaluru city – the reason? : కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో చాల దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పచ్చు. దీనికి కారణం బెంగళూరు నగరం లో నీరు లేకపోవడమే. కనీసం తాగడానికి కూడా నీళ్ళు దొరకడం లేదని వారు చెప్తున్నారు.

పరిస్థితులు కుడా చాలా దారుణం గా ఉన్నాయని చెప్తున్నారు. మంచి నీళ్ళు కోసం డబ్బాలు పట్టుకుని లైన్ లో గంటల తరబడి నించోవాలి అది కుడా దొరుకుతాయని గారెంటీ లేదని వారు చెప్తున్నారు. దీనివల్ల ఆఫీస్ లకు వెళ్ళ లేకపోతున్నామని వారు అంటున్నారు. దీనికారణం వల్ల IT కంపెనీలు వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని అనుమతించక తప్పడం లేదని పెద్ద పెద్ద IT కంపెనీలు చెప్తున్నాయి. ఇంతకుముందు ఎన్నడు ఇలాంటి పరిస్థితి చూడలేదని వారు చెప్తున్నారు.

రోజులో నీళ్ళ టాంకర్ లు ఎప్పడు వస్తాయో తెలియదు అని వచ్చిన అధిక రేటు చెప్తున్నారు అని వారు ఆరోపిస్తున్నారు. అంతే కాదు అపార్ట్మెంట్ లలో అయితే రేషన్ విధానం పాటిస్తున్నారు. ఒకవేళ నీళ్ళు ఎక్కువ వాడితే భారీ జరిమానాలు వేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. రోజుకు 500 రూపాయలు వరకు ఖర్చు చెయ్యాల్సి వస్తోందని వారు చెప్తున్నారు.

అయితే రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా IT ఉద్యోగులు అందరు వారి వారి ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండి నీళ్ళు లేక చాల ఇబ్బంది పడవలసి వస్తోంది అని అదే తమ సొంత ఊరికి వెళ్తే నీళ్ళ భాద తప్పుతుంది అని దీనికోసం వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని అనుమతించమని IT ఉద్యోగులు కోరుతున్నారు.

కొందరు అయితే ఉద్యోగాలు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జాబ్ లు చూసుకుంటున్నారు. ఇలా IT ఉద్యోగులు కంపెనీలు వదిలి వెళ్ళడం మాకు ఆందోళన కలిగిస్తోందని IT కంపనీలు అంటున్నాయి. ఇక్కడ పాలకులు కూడా నీళ్ళ మాఫియా తో చేతులు కలిపి ప్రజలను అసలు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు.

ప్రయివేటు ట్యాంకర్లు వాళ్ళు అయితే చెప్పిన దాని కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని ఎన్ని సార్లు కంప్లయంట్ ఇచ్చిన పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు కుడా మేము ఎం చెయ్యలేక చేతులు ఎత్తేక తప్పడం లేదని చెప్తున్నారు.

Leave a Comment