Tandel Movie is coming to the screen: సెట్స్ పైకి వెళతా అంటున్న’తండేల్’..పూజ కార్యక్రమానికి వెంకీ, నాగ్.

It is said that 'Tandel' will go up to the sets..Venky and Nag for the pooja program.

Tandel Movie is coming to the screen: సెట్స్ పైకి వెళతా అంటున్న తండేల్..పూజ కార్యక్రమానికి వెంకీ, నాగ్.

అక్కినేని వారి హీరో నాగ చైతన్య కధానాయకుడిగా చందు మొండేటి రూపొందిస్తున్న సినిమా తండేల్. వినడానికి టైటిల్ వెరైటీగా ఉన్నప్పటికీ టైటిల్ కి ఒక అర్ధం ఉంది.

తండేల్ అంటే ఒక తెగకి నాయకుడు అని అర్ధం. తండేల్ అనే సినిమా పూర్తిగా మశ్చకార నేపధ్యం లో తెరకెక్కే సినిమా. ఇందులో నటించడానికి ముందే చైతు మశ్చకార కుటుంబాలు ఎలా ఉంటాయి, వారు వేటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు,

వారి జీవనశైలి ఎలా ఉంటుంది, వారి డ్రెస్సింగ్ ఫుడ్ ఇలా అన్నిటి గురించి తెలుసుకున్నాడట. అదేంటి చైతూకి అంత అవసరం ఏమొచ్చింది, సెట్ లోకి వెళితే కాస్ట్యూమ్ డిసైనర్ ఆ కధకి తగ్గట్టు డ్రెస్ రెడీ చేస్తాడు, ఎలా యాక్ట్ చెయ్యాలో డైరెక్టర్ చెబుతాడు.

పైగా సంభాషణ పలికే విధానంలో ఏదైనా తేడా ఉన్నాగాని దర్శకుడే సరిదిద్దుతాడు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఒక నటుడికి ఎప్పుడైతే కథ విపరీతంగా నచ్చేస్తుందో అప్పుడు ఆ కథ లోకి లీనమవ్వడానికి ఇలా చేస్తుంటారు. ఆ పాత్ర తాలూకు నేపధ్యాన్ని తెలుసుకుని అందులో పరకాయ ప్రవేశం చేస్తారు.

పైగా ఈ సినిమా కోసం చైతు మాస్ లుక్ లో కనిపించనున్నాడు, బాగా కండలు పెంచేసి ఉన్నాడు. కేవలం బాడీ బిల్డ్ చేయడమే కాదు, లాంగ్ హెయిర్ తోపాటు, గడ్డం కూడా పెంచాడు.

ఇక ఈ సినిమాలో సాయి పల్లవి చైతు సరసన నాయికగా ఎంపికైంది. సాయి, చై జత కట్టడం ఇది రెండవసారి. వీరిద్దరూ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా లో ఆడిపాడారు. ఇక తాజాగా తండేల్ లో మరో మారు పెయిర్ అవుతున్నారు.

ఈ సినిమా షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభిండానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ బానర్ మీద అల్లు అరవింద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Add a heading 2023 12 09T104906.019 1 Tandel Movie is coming to the screen: సెట్స్ పైకి వెళతా అంటున్న'తండేల్'..పూజ కార్యక్రమానికి వెంకీ, నాగ్.

ఈ సినిమా పూజా కార్యక్రమాలను డిసెంబర్ 9వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లోని గ్లాస్ హౌస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చైతు మేనమామ, సీనియర్ టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తోపాటు చైతు తండ్రి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా హాజరవుతున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతానికి హీరో హీరోయిన్ పేర్లు మినహా మిగిలిన తారాగణం పేర్లు సినిమా యూనిట్ వెల్లడించలేదు.

అయితే చందు మొండేటి చై కి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి.

ప్రేమమ్ సినిమా విజయవంతం అయినప్పటికీ అది రీమేక్ సినిమా, ఆవరువాత వచ్చిన సవ్యసాచి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

దీంతో చందు తయారు చేసుకున్న సొంత కథ తో చై ను హీరోగా పెట్టి హిట్ కొట్టాల్సిందే అన్నట్టు చందు ఫిక్స్ అయ్యాడు. ఇక చందు మొండేటి కార్తికేయ సీరీస్ తో మాత్రం బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

కార్తికేయ రెండు భాగాలు పెద్ద సక్సస్ ను అందుకోగా దానికి మూడవ భాగాన్ని కూడా తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

Leave a Comment