
IT Raids in Congress candidates house : టి కాంగ్రెస్ ఇళ్లపై ఐటీ సోదాలు
అడవిలో పులిని వేటాడి చంపాల్సిన అవసరం లేదు. దానికి ఆహారం లేకుండా చేసి కూడా చంపేయవచ్చు. అలాగే ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల వారిని కూడా ఇలాగే బలహీన పరిచి ఓటమి పాలు చేయాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం అందుకే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులనే టార్టెట్ చేసి ఐటి టైడ్స్ నిర్వహిస్తోంది అని కొంత మంది రాజకీయ విశ్లేషకులు కవితాత్మకంగా వర్ణిస్తున్నారు.
వారి వర్ణనలకు తగట్టే హైదరాబాద్ లో నేడు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ అలాగే చిగిరింత పారిజాత నర్సింహ్మా రెడ్డి ఇంట్లో, ఇన్ కం టాక్స్ రైడ్స్ జరుగుతున్నాయి.
కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి చెందిన ఇల్లు కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు అధికారులు. ఇక పారిజాత నర్సింహ్మా రెడ్డి ఇంట్లో ఉదయం ఐదు గంటలకే ఐటి అధికారులు సోదాలు మొదలు పెట్టారు. ఆమె ఇల్లు కార్యాలయాలు మాత్రమే కాకుండా, ఆమెకు చెందిన 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఈ సమయంలో పారిజాత నరసింహారెడ్డి తిరుపతిలో ఉండగా, ఆమె భర్త నరసింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు.
బడంగ్ పేట్ మేయర్ గా ఉన్న ఆమె మహేశ్వరం టికెట్ ఆశించారు, అయినప్పటికీ ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఇక రైడ్స్ జారుతుండగా ఇంట్లో ఉన్న ఆమె కుమార్తె ఫోన్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
మహేశ్వరం టికెట్ కోసం టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి 10 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఆమె రెడీ అయినట్టు వార్తలు గుప్పుమనడంతోనే ఈ ఐటీ రైడ్స్ జరిగినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఐటీ రైడ్స్ జరగడమనేది కొంత చర్చనీయాంశంగా మారింది.