ప్రఖ్యాత జావెలిన్ త్రో అధ్లెట్ నీరజ్ చోప్రా ఇటీవల టాటా ట్రస్ట్ చైర్మన్ అయిన రతన్ టాటా ను కలవడం జరిగింది. ఆయనతో ఎన్నో విషయాలమీద చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఆయన నుండి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని అలాగే నేర్చుకున్నానని నీరజ్ చప్రా చెప్పారు.
ఆయనకి ఎంతో ముందు చూపు ఉంది అని ఆయన మాటలలో అర్ధం అయ్యిందని నీరజ్ చోప్రా చెప్పారు. అందుకే ఇన్ని సంస్దలను విజయవంతం నడపగలిగారు అని ఆయన చెప్పారు. ఆయన ఒక నిజమైన దార్శనికుడు అని ప్రేరణ కు మూలం అని నీరజ్ చోప్రా చెప్పడం జరిగింది. ” రతన్ టాటా సర్ ని కలిసే అవకాశం దక్కినందుకు నేను కృతజ్ఞుడను అని చెప్తూ ఇంస్టాగ్రామ్ పేజి లో ఆయనతో కలిసి తీయుంచు కున్న ఫోటో షేర్ చేసారు. అది ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతోంది.