Allu Arjun: అల్లు అర్జున్‎కు అరుదైన గౌరవం..దుబాయ్‎లో మైనపు విగ్రహం

website 6tvnews template 2024 03 29T122200.140 Allu Arjun: అల్లు అర్జున్‎కు అరుదైన గౌరవం..దుబాయ్‎లో మైనపు విగ్రహం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)‘పుష్ప’(Pushpa)సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాదు నేషనల్ లెవెల్ లో ఉత్తగా హీరోగా పురస్కారం కూడా అందుకున్నాడు. ఇదే ఊపులో బన్నీ ఇప్పుడు పుష్ప-2 (Pushpa 2) షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఆగస్ట్ 15 ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. వరల్డ్ ఫేమస్ మేడమ్ టుస్సాడ్స్ (madame tussauds)మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం (Wax Statue)కొలువుదీరింది. దుబాయిలోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్ ఈ వ్యాక్స్ స్టాచ్యూని లాంచ్‌ చేశాడు. బన్నీ గారాలపట్టి అల్లు అర్హ కూడా ఈ ఈవెంట్ లో సందడి చేసింది.

ఈ ఈవెంట్ కి సంబంధించిన వీడియోను బన్నీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ‎లో షేర్ చేశాడు. ఎమోషనల్ నోట్ తో అభిమానులను టచ్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటోలు,వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. బన్నీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

దక్షిణాది తొలి హీరోగా బన్నీ రికార్డ్‌ :

ఇప్ప‌టివ‌ర‌కు మేడమ్‌ టుస్సాడ్స్ (madame tussauds) మ్యూజియంలో లో సౌత్ స్టార్ హీరోస్ ప్రభాస్‌ (Prabhas), మహేష్‌ బాబు (Mahesh Babu)ల మైనపు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా చేరిపోయాడు. అయితే ప్రభాస్‌, మహేష్‌ ల విగ్రహాలు లండన్ కొలువుదీరగా..బన్నీ విగ్రహం మాత్రం దుబాయ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు దక్షిణాదికి చెందిన హీరోల మైనపు విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్ల్లు అర్జున్‌ ఈ ఘనతను దక్కించుకున్నాడు. అంతే కాకుండా దుబాయ్‌ గోల్డెన్‌ వీసాను కూడా అందుకున్న తొలి తెలుగుస్టార్‌ బన్నీ కావడం విశేషం. దక్షిణాది తొలి హీరోగా బన్నీ రికార్డ్‌ క్రియేట్ చేశాడు. దుబాయ్‌ (madame tussauds) మ్యూజియంలో ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌ (Amitab Bachhan), షారుక్‌ ఖాన్‌ (Sharukh Khan), ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai), వ్యాక్స్ స్టాచ్యూస్ కొలువుదీరాయి.

సేమ్ టు సేమ్ :

అల వైకుంఠపురములో (Ala Vaikuntapuramlo)లో బన్నీ రెడ్‌కలర్‌ కోట్‌ కాస్ట్యూమ్‌ ను రిఫెరన్స్ గా తీసుకుని ‘పుష్ప’లోని ‘తగ్గేదేలే’ మేనరిజంతో మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. బన్నీ ఈ లాంచింగ్ కార్యక్రమానికి తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వచ్చాడు.

బన్నీ సేమ్ టు సేమ్ కాస్ట్యూమ్ తో విగ్రహాన్ని ఆవిష్కరించాడు. బన్నీ మైనపు విగ్రహం లాంచ్‌ చేసినప్పుడు కూతురు అల్లు అర్హ సందడి చేసింది. విగ్రహంతో బన్నీ దిగిన సెల్ఫీ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ ఫొటోల్లో బన్నీకి, మైనపు విగ్రహానికి ఏ మాత్రం తేడా లేదు. డ్రెస్సింగ్ నుంచి గడ్డం, జుట్టు అంతా సేమ్ టు సేమ్ ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మరిచిపోని రోజు :

“ఈ రోజు చాలా స్పెషల్ డే. నా మొదటి సినిమా గంగోత్రి(Gangothri)ఈరోజు 2003లో విడుదలైంది. ఇదే రోజు నేను నా మైనపు విగ్రహాన్నిదుబాయ్‌లో లాంచ్ చేస్తున్నాను. ఇది 21 ఏళ్ల మరపురాని ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడిని. నా అభిమానులు వారి అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరినీ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నాను”. అని బన్నీ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.

Leave a Comment