Breaking News

Jabardast Emmanuel wrote that im dead : నేను చచ్చిపోయాను అని రాశారు చేతకాని కొడుకులు, నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్,

maxresdefault 2 Jabardast Emmanuel wrote that im dead : నేను చచ్చిపోయాను అని రాశారు చేతకాని కొడుకులు, నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్,

ఇటీవల ఫేక్ వార్తలు(Fake News) బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెలబ్రిటీల మీద అయితే వారు చనిపోయారని వార్తలు రాస్తున్నారు. ఎవరికైనా ఆనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినా, చనిపోయిన సన్నివేశాల్లో నటించినా ఆ నటులు మరణించారని పలు యూట్యూబ్ ఛానల్స్ థంబ్నైల్స్ పెట్టి మరీ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నాయి.

అలాగే తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మన్యుయెల్ మరణించాడని పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రమోట్ చేశాయి.
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ప్రేమ వాలంటీర్ అనే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ లో ఇమ్మాన్యుయేల్ చనిపోయినట్టు నటించాడు.

దీంతో ఆ ఫోటోలను తీసుకొని ఇమ్మాన్యుయేల్ మరణించాడని పలు యూట్యూబ్ చానళ్ళు ఫేక్ వీడియోలు పెట్టాయి. దీంతో ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో ఈ విషయం ఇమ్మాన్యుయేల్ వరకు చేరింది.
తాజాగా ఈ వీడియోలపై ఇమ్మాన్యుయేల్ స్పందిస్తూ ఓ వీడియో చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో.. చేతకాని కొడుకులు నేను చచ్చిపోయారని రాశారు. అది నటనరా.

ప్రేమ వాలంటీర్ సిరీస్ లో నేను చచ్చిపోయినట్టు నటించానురా. నేను బతికే ఉన్నాను. ఇలా రాసేవాళ్ళని చేతకాని కొడుకులు అంటారు అని నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా అలాంటి ఫేక్ వీడియోలు చేసే వారిపై విమర్శలు చేస్తున్నారు పలువురు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *