Jagan Government Good News For AP People : ఏపీ ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త.

website 6tvnews template 2024 01 27T110343.291 Jagan Government Good News For AP People : ఏపీ ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త.

Jagan Government Good News For AP People : ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లోని వైసీపీ సర్కారు పేద ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది.

అదేమిటంటే ఈ నెల అంటే జనవరి 27వ తేదీ నుండి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 9వ తేదీ వరకు ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరిట ఇచ్చిన భూములకు రిజిస్ట్రేషన్ చేయనుంది.

ఈ మేరకు భూపరిపాలన శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రిజిస్ట్రేషన్ ను బయో మెట్రిక్ ఆధారంగా చేయనున్నారు. దీని కోసం గ్రామాల్లోని గ్రామా సచివాలయాలు, పట్టణాల్లోని వార్డు సచివాలయాలు రిజిస్టర్ కార్యాలయాలుగా గుర్తింపబడనున్నాయట.

ఈ కార్యక్రమంలో విఆర్వో లు Village Revenue Officers భాగస్వాములు కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం పూర్తయింది. కేటాయించిన భూముల్లో ఇల్లు నిర్మించుకునేందుకు జననన్న కాలనీ పేరిట కాలనీలు కూడా ఏర్పాటుచేసింది సర్కారు.

కన్వేయన్స్‌ డీడ్ ఇవ్వనున్న సర్కారు : Conveyance deed will be issued by Govt

ys jagan1 1 Jagan Government Good News For AP People : ఏపీ ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త.

ఇప్పటివరకు కేటాయించిన ఇళ్లపట్టాలను సంబంధించి కన్వేయన్స్‌ డీడ్లను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇక ఈ రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే నెంబర్లు, ప్లాట్ నెంబర్లు, లబ్ధిదారుల పేర్లు ఎంటర్ చేసే సమయంలో చాల జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎటువంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలని సూచించింది.

ఇక ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేస్తున్న ఈ పట్టాలను కన్వేయన్స్‌ డీడ్(Conveyance deed) అని అంటారు. అయితే ఈ కన్వేయన్స్‌ డీడ్ లు సేల్ డీడ్(Sale Deed) లు గా మారడానికి పదేళ్ల గడువు పెట్టింది వైసీపీ సర్కారు.

పదేళ్ల తరవాత సేల్ డీడ్ గా మారిన ఆ పట్టాలు మరొకరి పేరు మీదకు మార్చి అమ్ముకోవడానికి వీలవుతుంది. సేల్ డీడ్ గా ఈ పట్టాలు రూపాంతరం చెందితే వాటిని వేరే వారికి విక్రయించుకోవడానికి ప్రభుత్వం ప్రమేయం అవసరం ఉండదని అంటున్నారు నిపుణులు.

అప్పటివరకు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఇవే : Till then these were the Joint Sub Register Offices


ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామ, వార్డు సచివాలయంలోనే జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం జనవరి 27 ఫిబ్రవరి 9వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాలు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా పరిగణించాలని అంటోంది.

ఈ రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో విఆర్వో లు సచివాలయాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని అంటున్నారు.

ఇక సబ్ రిజిష్టర్లుగా పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు వ్యవహరిస్తారని చెబుతున్నారు.

Leave a Comment