Jagan govt on free insurance: ఉచిత భీమా పై జగన్ సర్కారు..బావురుమంటున్న రైతన్నలు వరి పంటపై కేంద్రానికి నివేదిక.

Jagan govt on free insurance.. Farmers who are in good condition report to center on rice crop.

Jagan govt on free insurance: ఉచిత భీమా పై జగన్ సర్కారు లెక్కలు – బావురుమంటున్న రైతన్నలు – వరి పంటపై కేంద్రానికి నివేదిక..

బంగాళా ఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుఫాను అల్లకల్లోలం సృష్టించింది, ఆ తుఫాను తీరం దాటే సమయంలో భీభత్సం నెలకొంది. అయితే తుఫాను విషయంలో మీడియా సంస్థలు అబద్దాలు వల్లె వేశాయా ? పత్రికా సంపాదకులు అబద్హాల రాతలతో పేపర్లు నింపేశారా?

టిఆర్పి రేటింగ్ కోసం గ్రాఫిక్స్ సృష్టించి పబ్బం గడుపు కున్నారా ? అదేంటి అలా అంటున్నారు ? కుంభ వృష్టిగా కురిసిన వర్షాలు మీ కళ్ళకి కనిపించడం లేదా ? రైతుల ఆర్తనాదాలు మీ చెవులకు వినిపించడం లేదా అని మీరు ప్రశించవచ్చు.

కానీ ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సర్కారు వెలువరించిన పంట నష్టం గురించిన వివరాలు చూస్తే మీరు నివ్వెరపోయి నోరెళ్లబెడతారు. వైసీపీ సర్కారు చెప్పే లెక్కలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్రమంతా కలిపి వరి సాగు చేస్తున్న విస్తీర్ణం 0.04 హెక్టారులేనట.

మరి అందులో ఆ 0.04 హెక్టార్లలో ఎంత మేర పంట నష్టపోయింది ఎంత మేర బాగుంది, ఎంత మందికి నష్ట పరిహారం వస్తుంది అన్న లెక్కలైతే ఇప్పటికి చెప్పలేదు. ఐతే 0.04 హెక్టార్లే అని చెప్పింది ఎవరితోనో కాదు స్వయంగా కేంద్ర ప్రభుత్వంతోనే.

ప్రస్తుతం బాపట్ల జిల్లాలో తీరం దాటిన తుఫాను పంట భూములను చిన్నా భిన్నం చేసింది. ఒకొక్క రెండు మూడు వారాలు గనుక ఆగి ఉంటె రైతులు వరి కోతలు కోసి కుప్పలు వేసేవారు, లేదంటే కొంతమంది మిషన్లతో నూర్పిడి కూడా చేసి ధాన్యాన్ని ఆరబోసి నిల్వ చేసుకునే వారు.

కానీ సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతన్నలకు కడగళ్లు మిగిల్చింది. పంట ఇంటికొస్తుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతుల బ్రతుకును ఈ తుఫాను చిన్నాభిన్నం చేసింది. అప్పు తెచ్చి పంట పండించిన రైతులను నట్టేట ముంచింది.

ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో రైతులు లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య ధోరణితో కాకి లెక్కలు చెబుతోంది.

Add a heading 2023 12 08T104621.761 1 Jagan govt on free insurance: ఉచిత భీమా పై జగన్ సర్కారు..బావురుమంటున్న రైతన్నలు వరి పంటపై కేంద్రానికి నివేదిక.

పూర్తిగా నేలమట్టమైన పంటలకు నష్టపరిహారం దక్కకపోతుందా అనే భరోసా ను కూడా రైతుల మదిలో నుండి తుంచేసింది జగన్ సర్కారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చెప్పే లెక్కలు చుస్తే రైతులు మూర్ఛ పోతారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది వరి పంట పండించే విషయంలో రైతులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. వర్షాలు పడాల్సిన సమయంలో చాలా తక్కువ పడటం వల్ల, కాలువలు నిండుగా రాలేదు, దీంతో పంట పొలాల్లోకి నీళ్లు పారకపోవడంతో రైతులు మోటార్లు పెట్టి మరీ నీరు ఎక్కేలా చేసుకున్నారు.

సకాలంలో కాలువలు దండిగా నీటితో పారితే, పైసా ఖర్చు లేకుండా పొలానికి నీరు పెట్టుకోవచ్చు. కానీ డీజిల్ మోటార్లతో నీళ్లు పెట్టాలంటే ఎకరాకు ఎంతలేదన్నా సంవత్సరానికి 10 వేల రూపాయలు అవుతుంది, కరెంటు మోటారు తో అయితే సంవత్సరానికి మూడు నుండి 4 వేలు అవుతుంది.

నీరు తక్కువగా ఉండటంతో రైతులు బోర్లను, మోటార్లను ఆశ్రయించక తప్పలేదు. అదే జగన్ సర్కారు ముందుగా మేల్కొని గోదావరికి వరద వచ్చిన సమయంలో ఆ నీటిని కృష్ణా లోకి పట్టి సీమ మోటార్ల ద్వారా ఎత్తిపోస్తే ఆ ఖర్చు రైతులపై పాడేది కాదు.

అయితే జగన్ సర్కారు చంద్రబాబు కట్టిన పట్టి సీమ ఒట్టిసీమే అని నిరూపించాలనే భావనతో మొండి తనానికి పోయి మిన్నకుండిపోయిందో,

లేదంటే పట్టిసీమ నుండి నీటిని ఎత్తి పోయాలంటే అయ్యే కరెంటు ఖర్చు ప్రభుత్వానికి ఎందుకు, రైతులు కాలువలలో వచ్చే నీరు సొంత ఖర్చులతో తోడి పోసుకుంటారులే అని వదిలేసిందో అర్ధం కావడం లేదు. మొత్తానికి వరినాట్లు వేసే సమయంలో రైతులకు తడిసి మోపెడయింది.

ఎలాగోలా అధిక ఖర్చు అయితే అయిందిలే అని వ్యవసాయం చేస్తే ఇప్పుడు తీరా పంట ఇంటికి వచ్చే సమయంలో వరుణ దేవుడు కక్ష కట్టాడా అన్నట్టు వాన కురిపించాడు.

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కూసిన వానకి పంట సమూలంగా నష్టపోయింది. ఇది కేవలం వరి విషయంలోనే అనుకుంటే పొరపాటే, వరి తోపాటు, అరటి, మినుము, ప్రత్తి, మిరప, శనగ వంటి పంటలు కూడా నీటి పాలయ్యాయి.

ప్రస్తుతం పోయిన పంట పోగా మరో పంట వేసుకోవడానికి చేతి ఖర్చులకైనా ప్రభుత్వం అందించే పరిహారం పనికొస్తుందిలే అనుకుంటే ఆ ఆశలపై వైసీపీ సర్కారు నీళ్లు చల్లింది.

అన్నపూర్ణ లాంటి కృష్ణా డెల్టా లో వరి పంటే లేదన్నట్టు లెక్కలు చెబుతోంది. ఇంటి నిండా గంపెడు పిల్లలు ఉన్న తల్లిని గొడ్రాలు గా చిత్రీకరించినట్టు ఉంది ఏపీ ప్రభుత్వ తీరు.

Leave a Comment