Jagannadha Swamy temple at Unexpected incident: జగన్నాధ స్వామీ ఆలయంలో అనుకోని సంఘటన.తొక్కిసలాటలో భక్తులకు.
భారత దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో పూరి జగన్నాథ్ స్వామీ ఆలయం ఒకటి. ఒడిస్సా లో ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించుకునేందుకు మన దేశం నుండే కాక ప్రపంచంలోని అనేక దేశాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.
అయితే పూరి జగన్నాథ్ ఆలయంలో అనుకోని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ధన త్రయోదశి నాడు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు.
ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకోవడం వల్ల 10 మంది భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమమగా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఆలయం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య సేవలు అందుతున్నాయి.
ధన త్రయోదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. పైగా కార్తిక శుక్రవారం కూడా కావడంతో, విడి సందర్భాల కన్నా మరింత ఎక్కువ మంది భక్తులు వచ్చినట్టు తెలుస్తోంది.
ఊహించిన దానికన్నా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి రావడంతో భద్రతా సిబ్బంది, ఆలయ సిబ్బంది వారిని కట్టడి చేయలేకపోయారు.
పైగా ఉదయం వేళ ‘మంగళ ఆలటి’ నిర్వహించే వరకు వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా ఆలయం లోనికి తోసుకుంటూ వెళ్లారు. ఈ తోపులాటలో కొందరు ఆలయం మెట్లపై పడిపోయారు.
ఇక భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో కింద పడిన వారిని మిగిలిన వారు తొక్కుకుంటూ వెళ్లిపోయారు. దీంతో కొందరు భక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వారంతా విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.