రాబోయే ఎన్నికల కోసం ‘మేమంతా సిద్ధం ‘ అంటూ జగన్ బస్సు యాత్ర

x1080 రాబోయే ఎన్నికల కోసం 'మేమంతా సిద్ధం ' అంటూ జగన్ బస్సు యాత్ర

YS Jagan Bus Yatra: రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు దృష్తి లో పెట్టుకుని ఆంధ్ర ముఖ్యమంత్రి, YCP అధ్యక్షడు జగన్ ఎన్నికల ప్రచారం లో పాల్గొనేందుకు తన షెడ్యుల్ ప్రకటించారు. ఈ నెల మార్చి 27వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని తెలుస్తోంది. తన ఎన్నికల ప్రచారం ఇడుపులపాయ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం చెయ్యాలని అనుకుంటున్నట్లు తెలిసింది. మొత్తం 21 రోజుల పాటు సాగే ఈ బస్సు యాత్ర అన్ని నియోజకవర్గాలను కలుపుకుంటూ వెళ్ళాలని ఆ విధం గా రూట్ మ్యాప్ ప్లాన్ చేశామని YCP నాయకులు చెప్తున్నారు. ఇటీవల సిద్ధం సభలు జరిగిన నాలుగు జిల్లాలను ప్రచారం జరిగే ప్రాంతాల లిస్టు లో ఎంపిక చేయ్యలేదని మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాలను మాత్రమే కలుపుతూ ఈ యాత్ర కోనసాగనుందని నాయకులూ తెలిపారు.

ఉదయం పూట ఆయా ప్రాంతాల్లో ఉన్న మేధావుల తోనూ స్థానిక ప్రజలతోను సీఎం మాట్లాడతారని అంతే కాకుండా మంచి పాలన అందించడానికి కావలసిన సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుంటారని వారు చెప్పారు. కేవలం సాయంత్రం పూట నిర్వహించే బహిరంగ సభలో మాత్రమే మాట్లాడుతరని వైసీపీ నాయకులు వెల్లడించారు.

ఈ యాత్ర కోసం బయల్దేరిన జగన్ (YS Jagan Bus Yatra)అన్ని ప్రాంత ప్రజలతో కలిసి కాసేపు అన్ని విషయాలు ముచ్చటిస్తారని నాయకులు చెప్పారు. ఈ బస్సు యాత్రలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం అలాగే ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్రసంగాలు ఉంటాయని వారు చెప్పారు. ఈ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ముగిసిన అనంతరం పూర్తిగా క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాల నాయకులతో కలుసుకుంటూ ఎన్నికల ప్రచారమే ఉంటుందని YCP నాయకులు చెప్తున్నారు.

Leave a Comment