రాబోయే ఎన్నికలలో జగన్ పరిస్థితి – ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

Prashant Kishor 1 రాబోయే ఎన్నికలలో జగన్ పరిస్థితి - ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

Jagan’s situation in upcoming elections – Prashant Kishore’s sensational comments : అయిదేళ్లలో మొత్తం వనరులను కొన్ని అంశాలపైనే ఖర్చు పెట్టడం, అభివృద్ధిని పట్టించుకోకపోవడం ద్వారా జగన్‌ పెద్ద తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జగన్‌ పరిస్థితి చూస్తుంటే మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని అన్నారు. పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, దీనికి భిన్నంగా ప్యాలెస్‌ల్లో ఉంటూ ప్రజల బాగోగులన్నీ తామే చూసుకుంటున్నామని భావిస్తున్నారని.. ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించబోరని ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు.

‘ప్రజలు ఎన్నుకున్న పాలకులు ఒక ప్రొవైడర్‌కంటే మెరుగైన పాత్ర పోషించాలి. కానీ చాలా మంది నాయకులు తమను తాము ప్రజలకు రాయితీలు కల్పించే ప్రొవైడర్లుగానే భావించుకుంటున్నారు. అలాంటివారు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు’ అని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో జగన్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

జగన్ పాలన లో ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని వస్తాయి అనుకున్న కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళి పోయాయని ఆ రాష్ట్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఆయన ఆన్నారు. అంతే కాకుండా జగన్ పాలనలో బాగా అవినీతి పెరిగిపోయిందని ఇదొక కారణం అని ఆయన చెప్పారు.

ఇంతవరకు అసలు రాష్ట్రానికి రాజధాని లేదని కనీసం ఆ ప్రయత్నాలు కూడా చెయ్యలేదని అక్కడి ప్రజాలు అనుకుంటున్నారని ఆయన చెప్పారు. 2019 జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి ఈ ప్రశాంత్ కిషోర్ కారణం అని కాని ఈ సారి ఇద్దరికీ చెడిపోవడం వల్ల నో లేక అయన కి వచ్చిన వ్యతిరేకత వల్ల నో ఈ సారి ప్రశాంత్ కిషోర్ జగన్ కు దూరం గా ఉంటున్నారు. మరి చూడాలి ప్రశాంత్ కిశోర్ జ్యోస్యం ఎంతవరకు నిజం అవుతుందో.

Leave a Comment