jai hanuman part 2 updates: జై హనుమాన్ మూవీ గురించి ప్రశాంత్ వర్మ కీలక వాఖ్యలు

hanuman part 2 672 1705978586 jai hanuman part 2 updates: జై హనుమాన్ మూవీ గురించి ప్రశాంత్ వర్మ కీలక వాఖ్యలు

ఈరోజుల్లో ప్రతి సినిమా ఘన విజయం సాదించింది అని చెప్పడమే కాని నిజం గా ఎన్ని రోజులు ఆడుతుందో కూడా చెప్పలేము. ఇదివకటి రోజుల్లో ఒక సినిమా ఘన విజయం సాధించింది అంటే అది 100 రోజులు ఆడిన తర్వాత ఒకరోజు పెద్ద ఎత్తున ఒక పండగ ల చేసేవారు. ఆ కార్యక్రమానికి అందులో నటించిన నటీనటులు అందరూ వచ్చేవారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అసలు సినిమాలు 100 రోజులు కూడా ఆడకుండా వెళ్ళి పోతున్నాయి. ఇక శతదినోత్సవ వేడుకలు ఎలా చేస్తారు. చాల కాలం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అదే హనుమాన్ మూవీ. చాల సంతోషం గా ఉంది 50 రోజులు పూర్తిచేసుకున్నందుకు అని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. ఈ విజయం మొత్తం హనుమాన్ టీం కి చెందుతుంది అని చెప్పారు.

ఈ సినిమా విడుదల అయినప్పటి నుండి ఆడియెన్సు నుండి ఎలా రెస్పాన్సు వస్తుందా అని టెన్షన్ పడ్డామని ఆయన చెప్పారు. ఈ మూవీ కమర్షియల్ హిట్ కాదని చాలా మంది విమర్శించారని, కాని మేము ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చారని అందుకు అందరికి ఎంతో రుణ పడి ఉంటాను అని ఆయన చెప్పారు. మీరు ఇచ్చిన ప్రోత్సాహం తో మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.

ఇప్పడు సీక్వెల్ గా హనుమాన్ కి జై హనుమాన్ కు సంబందించిన అన్ని పనులు మొదలు పెట్టమని ఆయన చెప్పారు. త్వరలో ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇందులో పూర్తిగా హనుమంతుడే హీరో అని ఆయన చెప్పారు. క్లైమాక్స్ ను చాల కొత్తగా, మీ అందరికి నచ్చే విధం గా ఉంటుందని ఆయన చెప్పారు. హనుమాన్ లో నటించిన వారు అందరు జై హనుమాన్ లో కూడా నటిస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు హనుమాన్ మూవీ 330 కోట్ల కు పైగా వసూలు చేసిందని ఆయన చెప్పారు.

Leave a Comment