ఆన్ లైన్ గేమ్స్ తో లక్షలు సంపాదిస్తున్న జమ్మూ – కాశ్మీర్ మహిళా

website 6tvnews template 2024 03 13T161010.624 ఆన్ లైన్ గేమ్స్ తో లక్షలు సంపాదిస్తున్న జమ్మూ - కాశ్మీర్ మహిళా

Jammu and Kashmir women earning lakhs with online games : రీతు అనే మహిళది జమ్మూ కాశ్మీర్ ప్రాంతం లో ఉంటుంది. తనది మద్య తరగతి కుటుంబం కావడం తో తన చదువుని ఇంటర్ తో ఆపేసింది. అంతే కాదు 20 సంవత్సరాల వయస్సులోనే వివాహ చేసుకుంది. ఇప్పుడ ఒక మంచి భార్య గా ఒక తల్లి గా ఆనందం గానే ఉన్నానని చెప్తోంది.

ఒక రోజు తన మనసు మాట ను తన కొడుకుని అడిగి తెలుసుకుంది. అసలు ఆన్ లైన్ గేమ్స్ అంటే ఏంటి అడిగింది. ఇప్పటికి నా కొడుకే నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. ఒకరోజు ఆన్ లైన్ గేమ్స్ అంటే ఇష్టమని నేర్పమని అడిగింది.

తన కొడుకు కూడా సరే నేర్పుతాను అని చెప్పాడు. అలా రోజు రోజు కి ఆన్ లైన్ గేమ్స్ మీద పట్టు సాధించింది. ఆ తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గేమ్స్ ఆడడం మొదలు పెట్టాను అని చెప్పింది. అలా ఆడుతున్న సమయం లో కొంత మంది ఆన్ లైన్ గేమేర్స్ తో కనెక్ట్ అవుతూ మరింత పట్టు సాధించాను. అలా ఆడుతున్నకొడ్డి నాకు చాల మంది ఫోలోవర్లు పెరిగారు.

అల ఆడుతూ పోతు ఉన్నాను అల ఒక రోజు బ్లాక్ బర్డ్ YT అనే పేరు తో ఒక యూ ట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసాను. తాను ఆడిన ఆన్ లైన్ గేమ్స్ అన్ని వీడియోలు అన్ని యు ట్యూబ్ లో పోస్ట్ చెయ్యడం మొదలు పెట్టాను. రీతు ఇప్పుడు రూటర్ అనే గేమింగ్ ఫ్లాట్ ఫాం లో ప్రొఫెషనల్ గేమర్ గా మారానని చెప్పింది.

ఈ గేమింగ్ ఫ్లాట్ ఫాం ద్వార ఆమెకు 3.8 లక్షల మంది ఫోలోవర్స్ ఉన్నారు. దీని ద్వార ఆమెకు ఏడాదికి 10 నుండి 13 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఉదయం 8.00 గంటలకు మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసుకుని కంప్యూటర్ మీద పడిపోతానని ఆమె చెప్పింది. ఒకప్పుడు ఈ వయస్సులో ఆటలెంటి అని అడిగేవారు అని ఇప్పుడు కాలి సమయం లో అందరు తనతో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్నారని చెప్పింది.

రోజులో 4 నుండి 5 గంటలు మాత్రమే కంప్యూటర్ తో గడుపుతానని మిగిలిన సమయం లో నా కుటుంబ సబ్యులతో కాలక్షేపం చేస్తానని చెప్పుకొచ్చింది.భవిష్యత్ లో తానే ఆన్ లైన్ గేమ్స్ కి సంబందించి కొన్ని కంటెంట్ లు తయారు చేయాలనీ అనుకుంటున్నానని చెప్పింది.

Leave a Comment