ఇవాళ పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం – జనసేన అధినేత పవన్ కళ్యాన్

website 6tvnews template 2024 03 30T152435.447 ఇవాళ పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం - జనసేన అధినేత పవన్ కళ్యాన్

రాబోయే పార్లమెంట్ , అసెంబ్లీ న్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. TDP అధ్యక్షుడు నారా చంద్రబాబు ఇప్పటికే ప్రజా గళం పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. YCP అధినేత, AP – CM YS జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం అనే పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టడం తెలిసిన విషయమే. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

గతంలో రాష్ట్రంలోని పలు చోట్ల వారాహి యాత్ర చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారాహి యాత్ర పేరుతో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆయన అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన పురుహతిక అమ్మవారిని దర్శించుకుని ముందుగా TDP ఇన్‌ఛార్జ్ వర్మతో సమావేశమై చేబ్రోలులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ప్రముఖ నేతలు చెప్తున్నారు.

పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన అనంతరం తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగం గా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తొలి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ లో భాగం గా తెనాలి, నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, కాకినాడ రూరల్, తదితర నియోజకవర్గాల్లో మొదట పర్యటించి తర్వాత ఎక్కడ నుండి ప్రచారం మొదలు పెడతారో అప్పుడు నిర్ణయిస్తామని ఆయన అన్నారు.

Leave a Comment