మాజీ సీఎం మనవడితో జాన్వీ పెళ్లి ఫిక్స్..కన్ఫామ్ చేసిన బోనీ కపూర్

1d8996a0271f3f76d2305292997304b1 మాజీ సీఎం మనవడితో జాన్వీ పెళ్లి ఫిక్స్..కన్ఫామ్ చేసిన బోనీ కపూర్

అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి (sridevi)పెద్ద కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది. ఓ వైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR),మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan)సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీని సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్‎గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడిచినా ఏ సినిమా కూడా అమ్మడికి స్టార్ ఇమేజ్ ను ఇవ్వలేదు.

బాలీవుడ్ ఈ బ్యూటీకి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. జాన్వీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆవరేజ్ టాక్ తోనే నడిచింది. దీంతో తండ్రి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) జాన్వీని తెలుగులో లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దానికి తగ్గట్టే జాన్వీ క్రేజీ ప్రాజెక్టులు సైన్ చేసింది. తండ్రి ఇస్తున్న గైడెన్స్ తో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బోనీ కపూర్ జాన్వీకి త్వరలో పెళ్లి చేస్తామని చెప్పి ఫ్యాన్స్ ను షాక్ చేశాడు. ఎంగేజ్మెంట్, పెళ్లి డేట్లను సైతం త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. దీంతో నేషనల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.

పెళ్లిని కన్ఫామ్ చేసిన బోనీ కపూర్ :

గ‌త కొన్నేళ్లుగా జాన్వీ క‌పూర్‌ (Janhvi Kapoor) శిఖ‌ర్ పహారియా (Sikar Pahariya) డేట్ చేస్తున్నారు. వీరిద్దరూ క‌లిసి ఉన్న ఫోటోలు సైతం నెట్టింట్లో నిత్యం వైర‌ల్ అవుతుంటాయి. జాన్వీ పర్సనల్ వెకేషన్ లో కూడా శిఖర్ కనిపిస్తుంటాడు. తిరుమలకు వచ్చినా జాన్వీ తన బాయ్ ఫ్రెండ్ ను వెంటబెట్టుకుని మరీ వచ్చేస్తుంది. దీంతో గత కొంతకాలంగా జాన్వీ లవ్ అఫైర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా గురించి బీ టౌన్ లో బోలెడు స్టోరీలు వస్తున్నాయి. వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యం లేదని పలు న్యూస్ పేపర్స్ న్యూస్ పబ్లిష్ చేశాయి. తాజాగా బోనీ కపూర్ కూడా పెద్ద కూతురు పెళ్లిని కన్ఫామ్ చేశాడు. కాబోయే అల్లుడు గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

ఆ కుర్రాడు చాలా మంచి వాడు :

ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ (Boney Kapoor)మాట్లాడుతూ…” శిఖర్ మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మాకు ఏ అవసరం వచ్చినా ముందుంటాడు. కొంత కాలం జాన్వీతో మాటలు లేనప్పుడు కూడా శిఖర్ తో టచ్ లో ఉన్నాను. ఆ కుర్రాడు చాలా మంచి వాడు. శిఖ‌ర్ తండ్రి సంజ‌య్ ప‌హారియా. మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లో ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. శిఖర్ తల్లి మహారాష్ట్ర మాజీ సీఎం, సెంట్రల్ మినిస్టర్ గా ప‌నిచేసిన సుశీల్ కుమార్ షిండే (Sushil Kumar Shinde)కూతురు. శిఖర్ లండన్ లో గ్రాడ్యుయేషన్ చేశాడు. శిఖర్ కు సొంతంగా ఓ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ కంపెనీ ఉంది. తన సోదరుడితో కలిసి పలు బిజినెస్ లు చేస్తున్నాడు.” అని శిఖర్ గురించిన డీటైల్స్ మొత్తం తెలిపాడు బోనీ కాపూర్. దీంతో జాన్వీ కపూర్ పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Leave a Comment