ఇటు రామ్.అటు భీమ్ఇద్దరితో రొమాన్స్

website 6tvnews template 2024 03 06T120917.541 ఇటు రామ్.అటు భీమ్ఇద్దరితో రొమాన్స్

Janhvi Kapoor to cast opposite Ram Charan in Buchi Babu film RC16 : జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)కు టాలీవుడ్ నుంచి వరుసగా క్రేజీ ఆఫర్లు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా తెరకెక్కుతున్న దేవర (Devara) సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ భామ మరో తెలుగు చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ (Ramcharan)హీరోగా బుచ్చి బాబు (BUchibabu)డైరెక్షన్ వహిస్తున్న RC16 మూవీలో చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది జాన్వీ. మార్చ్ 6న జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers)ఈ విషయనాన్ని అధికారికంగా ప్రకటించారు. జాన్వీ బర్త్ డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ షేర్ చేశారు.

RC16 బోర్డ్‌లో జాన్వీ కపూర్ , ఖగోళ సౌందర్యానికి స్వాగతం, పుట్టినరోజు శుభాకాంక్షలు అనే క్యాప్షన్ తో ఈ పోస్ట్ షేర్ చేశారు. మొత్తానికి ‘ఉప్పెన’ (Uppena) తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నకు ఈ ఒక్క పోస్టుతో తెరపడింది

జాన్వీ బర్త్ డే గిఫ్ట్ అదుర్స్ :

ఇవాళ అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి (Sridevi) పెద్ద కూతురు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor)పుట్టినరోజు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ తమ సినిమాలో ఆమెను స్వాగతిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే జాన్వీ తండ్రా బోనీ కపూర్ (Boney Kapoor)సైతం కన్ఫామ్ చేశారు.

త్వరలోనే జాన్వీ రామ్ చరణ్ (Ramcharan)సినిమాలో కనిపిస్తుందని చెప్పారు. గేమ్ చేంజర్ (Gamechanger)తర్వాత చరణ్ చేస్తున్న మూవీ ఇది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సతీష్ కిలారు (Satish Kilaru)ప్రొడ్యూజ్ చేస్తున్నారు. బుచ్చిబాబు (Buchi Babu)డైరెక్షన్ కు తోడు సుకుమార్ (Sukumar)రైటింగ్స్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ . ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ మ్యుజిషియన్ ఏఆర్ రెహమాన్(A.R.Rehman) మ్యూజిక్ అందించనున్నారు.

సర్‌ప్రైజ్ లుక్‎లో చరణ్ :

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కొడుకైనా తన టాలెంట్ తోనే ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు రామ్ చరణ్ (Ramcharan). తన ఫ్టస్ మూవీ చిరుత(Chirutha)తోనే తన ప్రతిభను తెలుగు ప్రేక్షకులను చూపించాడు. నటనలో, డ్యాన్సింగ్ లో చరణ్ స్టైలే వేరు. చరణ్ చేసే ప్రతి సినిమా కొత్తగా ఉంటుంది. తనలోని నటుడిని ఎన్నో విధాలుగా చూపిస్తుంటాడు చరణ్. ఇక దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR)తో చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.

అయినా ప్రయోగాలకు ఎప్పుడు ముందుంటాడు చరణ్. ఇక నటుడిగా చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన మూవీ ‘రంగస్థలం’ (Rangasthalam).ఈ మూవీలోని చిట్టిబాబు క్యారెక్టర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్యారెక్టర్ కు మించి ‘RC16’లో చరణ్ క్యారెక్టర్ ఉండబోతోందట. ఈ సంగతిని స్వయంగా రామ్ చరణ్ చెప్పాడు. అంతే కాదు ఆర్సీ 16లో తన క్యారెక్టర్ కోసం స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడట. అయితే జాన్వీ పాత్ర ఎలా ఉంటుంది అన్న విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

Janhvi Kapoor to cast opposite Ram Charan in Buchi Babu film RC16

Leave a Comment