Janvi Kapoor Next Film with Mega Family ? : మన తెలుగు సినిమా అందాల తార శ్రీదేవి బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో మంచి నటి గ పేరు సంపాదించింది . ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా ఆ ఫార్ఫాములానే ఫాలో అవుతోంది.
ఇక ఇప్పుడు సౌత్ ఇండియాలో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని చూస్తోంది . ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోందని సినీవర్గాలు చెప్తున్నాయి. అంతే కాదొండోయ్ లేడి ఓరియెంటెడ్ సినిమాలతోను ప్రేక్షకులను ఆకట్టు్కుంటోంది ఈ అమ్మడు.
ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ కు దేవర సినిమా ద్వార తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాబోతోంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తున్న ‘దేవర మూవీ’తో చాలా బిజి బిజీగా ఉంది. ఇక ఇప్పుడు మరో తెలుగు కి సైన్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇది తెలిసిన అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు.
జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘దడక్’ అనే మూవీ తో బాలీవుడ్ లో తొలిసారిగా నటించింది. ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
కానీ ఇప్పుడు రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ తో బిజీగా ఉన్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ‘RC 16’ లో రామ్ చరణ్ తో పాటు కథానాయికగా జాన్వీ కపూర్‌ని ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది.
ఈ మూవీ మొత్తం పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో జాన్వీ డిగ్లామర్ లుక్‌లో మెరిసేందుకు రెడీ అవుతోంది. బుచ్చిబాబు ఇప్పటికే జాన్వీ కపూర్‌కి కథ చెప్పాడట. ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందని టాక్. అయితే ఈ మూవీలో రవీనా టాండన్ కూతురు రాషా తడానీ కథానాయికగా నటిస్తుందని గతంలో అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ ని జాన్వీని వరించిందని తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ మూవీ సంగీతం బాణీలు అందిస్తున్నట్లు ఇప్పటికే ఈ మూవీ డైరెక్దటర్ కి కొన్ని ట్యూన్స్ ఇచ్చినట్లు సంచారం, ఈ మూవీ అప్డేట్ కోసం కొన్ని రోజులు ఆగాల్సిందే.