Japan Movie Review : కార్తీ నటించిన జపాన్ సినిమా ఎలా ఉందంటే. సినిమాలోని ప్లస్సులు మైనస్సులు.

ezgif 4 5c4b5a33a6 Japan Movie Review : కార్తీ నటించిన జపాన్ సినిమా ఎలా ఉందంటే. సినిమాలోని ప్లస్సులు మైనస్సులు.

Japan Movie Review : కార్తీ నటించిన జపాన్ సినిమా ఎలా ఉందంటే. సినిమాలోని ప్లస్సులు మైనస్సులు.

హీరో కార్తీ గురించి చెప్పాలంటే తమిళ హీరో కార్తీ అని చెప్పాలా లేక తెలుగు హీరో కార్తీ అని చెప్పాలో అర్ధం కాదు. ఆతను తెలుగు చాలా చక్కగా మాట్లాడే తమిళ ఆర్టిస్ట్. అతని ప్రతి సినిమా తమిళంతోపాటు తెలుగు లో కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది.

ముఖ్యంగా అయన సినిమాలోని కొన్ని డైలాగులు, కొన్ని సన్నివేశాలను తెలుగు వారిని దృష్టిలో పెట్టుకుని తీస్తూ ఉంటారు. సినిమా రిసల్ట్ ఎలా ఉన్నా పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు కార్తీ.

ఇప్పుడు కార్తీ నటించిన తాజా చిత్రం జపాన్. ఇవాళ ఈ సినిమా వెండితెరపై పడింది. మరి బొమ్మ ఎలా ఉందొ ఒక లుక్కేద్దాం రండి.జపాన్ పేరుతొ తెరకెక్కిన ఈ సినిమా ఒక దొంగ ఇతివృత్తం తో రూపొందించారు.

కథ విషయానికి వస్తే హీరో పేరు జపాన్, పేరుమోసిన గజదొంగ, అతను ఉండే నగరంలోని ఒక పెద్ద నగల దుకారంలో నగలు చోరీకి గురవుతాయి. వాటి విలువ 200 కోట్ల రూపాయలు.

అయితే ఆ బంగారు నగల చోరీని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ అనే క్యారెక్టర్ ను మన సునీల్ పోషించాడు. ఈ సినిమాలో జపాన్ మాట్లాడే తీరు బాగా ఆకట్టుకుంటుంది.

జపాన్ కు సినిమా హీరో అవ్వాలనే పిచ్చి ఉంటుంది. అతని తో పాటు సినిమా ఆర్టిస్ట్ గా ఉన్న సంజు పై మనసు పారేసుకుంటాడు. అను ఇమ్మాన్యుయేల్ ఆ సంజు పాత్రను పోషించింది. ఆ సంజు వల్లనే జపాన్ పోలీసుల వలలో చిక్కుకుంటాడు.

మరి అను ఇమ్మాన్యుయేల్ ఎలా చేసింది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆమె అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ లా తీశారు హీరోయిన్ పాత్రను.

ఈ పాటికే మీకు అర్ధమై పోయి ఉంటుంది, సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయి ఉంటుంది అని.

హీరోను దొంగ గా చూపెడుతూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అటు తమిళ్ ఇటు తెలుగులో చిలిపి దొంగలను హీరోగా చూపెట్టి బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శకులు ఎంతోమంది ఉన్నారు.

కానీ దర్శకుడు మురుగన్ కి కార్తీ లాంటి వైవిధ్యాన్ని చూపెట్టే నటుడు దొరికినప్పటికీ ఆ స్థాయిలో వాడుకోలేకపోయాడు. కథ పరంగా సినిమా చాలా బలహీనంగా ఉంటుంది.

]ఎక్కడ ప్రేక్షకుడికి త్రిల్ ఫీలింగ్ రానే రాదు. పైగా అమ్మ సెంటిమెంట్ ను ఏమైనా వాడుకున్నాడు కదా అంటే, ఆ సీన్ల వెంటనే అర్ధం పర్ధం సీన్లు తీసుకొచ్చి పెట్టి ఆ ఫీల్ లేకుండా చేసాడు.

అలాంటి సీన్లు చూస్తెనే, ప్రేక్షకుడు స్క్రీన్ ప్లే వీక్ అని పెదవిలో విరిచేస్తాడు. ఫస్ట్ ఆఫ్ అయినా పర్లేదు ఎక్కడో ఒక చోట కొద్దిగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి కానీ సెకండ్ ఆఫ్ చాలా దారుణంగా ఉంటుంది.

ఇక కేఎస్ రవికుమార్ వంటి దర్శకుడితో ఒక క్యారెక్టర్ చేయించుకుంటున్నామంటే ఆ క్యారెక్టర్ కి కొంత వెయిట్ ఉండేలా చూసుకోవాలి, కానీ అసలు అయన పోషించిన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు.

సాంకేతిక బృందం విషయానికి వస్తే..ఈలాంటి సినిమాలకు సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవాలి, కానీ జివి ప్రకాష్ బాణీలు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్కడా ఆకట్టుకోలేకపోయాయి.

ఆర్ ఆర్ మాత్రం అక్కడక్క పరవలేదులే అనిపించింది. ఎడిటింగ్ విషయానికి వస్తే దర్శకుడిమీద ఎడిటింగ్ ఆధారపడి ఉంటుంది. తనకు ఎం కావాలో డైరెక్టర్, ఎడిటర్ కు చెప్పి చేయించుకోవాలి.

సినిమాటోగ్రఫీ పనితనం మాత్రం మెచ్చుకోవచ్చు. రవి వర్మన్ తన కెమెరా పనితనాన్ని చక్కగా చూపెట్టారు. మరొక్కసారి దర్శకుడి గురించి చెప్పాలంటే రాజు మురుగన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

కార్తీ లాంటి నటుడిని ఎంచుకుని మంచి పని చేసినా కథను పక్కాగా రాసుకోవడంలో ఎక్కడో పొరపాటు పడ్డాడు. అందుకే సినిమా ఫలితం మిస్ ఫైర్ అయింది అంటున్నారు జపాన్ సినిమా చుసిన వారు.

Leave a Comment