Ramcharan: జరగండి పాట.. దుమ్మురేపుతోందిగా..

website 6tvnews template 2024 03 27T120002.875 Ramcharan: జరగండి పాట.. దుమ్మురేపుతోందిగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) బర్త్ డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు గేమ్ ఛేంజర్ (Gamen Changer)మూవీ మేకర్స్ . సిపిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. “జరగండి జరగండి జరగండి.. జాబిలమ్మ జాకెట్టేసుకోని వచ్చేసేనండి..”అంటూ సాగే మాస్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. మరోసారి థమన్ (Thaman) తన మ్యూజిక్ తో మ్యూజిక్ చేశాడు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ (Ananth Sriram) లిరిక్స్ అందించారు.

డాలర్ మెహెన్ది (Doller Mehendi), సునిధి చౌహన్ (Sunidhi Chauhan)ఈ పాటను అద్భుతంగా పాడారు. ప్రభుదేవ (Prabhudeva) కొరియోగ్రాఫీలో రామ్ చరణ్ , కియారా (Kiara) స్క్రీన్ మీద కారాక్ మాస్ స్టెప్స్ మేస్తారని ఈ లిరికల్ సాంగ్ బట్టి తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ స్టాండర్డ్ విజన్ లో ఈ సాంగ్ ని చాలా గ్రాండ్ గా రూపొందించారు. చరణ్ లుక్స్ కూడా ఫ్యాన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

పొలిటికల్ లీడర్‎గా చరణ్ :

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా గేమ్ ఛేంజర్ (Gamen Changer)మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇది యాక్షన్ డ్రామా మూవీ. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) రెండో సారి రామ్ చరణ్ తో జోడీ కట్టబోతోంది. అంజలి (Anjali)కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర బ్యానెర్ లో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటులు శ్రీకాంత్ (srikanth), సునీల్ (Sunil)లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక ఈ మూవీకి తమన్ (Thaman) సంగీతం అందించాడు. ఈ మూవీలో చరణ్ ది డ్యుయర్ రోల్. ఫస్ట్ టైం పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు. అలాగే మరో క్యారెక్టర్ లో ఐఏఎస్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ మొదలై చాలా కాలమే అయ్యింది. అయితే కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్ మాత్రమే విడుదల చేశారు మేకర్స్ . ఇక ఈ రోజు చరణ్ బర్త్ డే కావడంతో ఈ మూవీ నుంచి ఈ పాటను రిలీజ్ చేశారు.

అదిరిపోయే ప్రాజెట్స్ :

ప్రస్తుతం శంకర్ (Shankar )డైరెక్షన్ లో గేమ్ ఛేంజ‌ర్(Game Changer )మూవీ పూర్తి కాగానే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు(Buchhi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గ్రామీన నేపథ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ సినిమాలో క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్‌కుమార్ (ShivaRajkumar) కీల‌క పాత్రలో కనిపించునున్నారు

. ఇదిలా ఉంటే రంగస్థలం (Rangasthalam) కాంబినేషన్ మరోసారి రాబోతుంది అని అనౌన్స్ మెంట్ వచ్చేసింది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఆర్‎సీ 17కి సైన్ చేసి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచాడు మెగా వారసుడు . అయితే ఈ రెండు సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Comment