Jasprit Bumrah 30th Birthday: బుమ్రా బర్త్ డే స్పెషల్..అవమానించిన వాళ్ళే ఎలా పొగిడారు.
బుమ్రా బర్త్ డే స్పెషల్ – అవమానించిన వాళ్ళే ఎలా పొగిడారు.
జీవితం ఎవ్వరికి సాఫీగా సాగదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు, కటిక పేదవాడికి ఉండే కష్టాలు, వారికి ఉంటె అపర కుబేరులకు ఉండే అవస్థలు వారికి ఉంటాయి.
ఒకరికి తినడానికి లేక అలమటిస్తుంటే, మరొకరు తిన్నది అరిగించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇది సామాన్య మానవుల సంగతి. కానీ వీరు కాకుండా మరో జాబితా ఉంటుంది, ఆ జాబితా లోని వారు ఏ స్థితిలో ఉన్నా తమ లక్ష్యాల కోసమే జీవిస్తుంటారు.
వారికి కళ్ళముందు ఉన్న కష్టం కన్నా వారి కాలలో కనిపించే లక్ష్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాని కోసమే పాటు పడతారు. అచ్చం అలాంటి వాడే ఇండియన్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆశక్తికర విషయాలు మీకోసం.
ఇండియన్ క్రికెట్ లో పేస్ బౌలింగ్ కన్నా స్పిన్ బౌలింగ్ కె ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మనకి ఉన్న పిచ్ లు కూడా అందుకు దోహదపడ్డాయని చెప్పొచ్చు.
మన ఉప ఖండంలోని పిచ్ లు స్పిన్ బౌలింగ్ కె ఎక్కువ అనుకూలం కావడంతో ఫాస్ట్ బౌలింగ్ కి అంతటి ప్రాముఖ్యత దక్కలేదు. అయితే ఇప్పుడున్న బౌలర్ల లో జస్ప్రీత్ మాత్రమే తన ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తున్నాడు.
అతనికి పిచ్ ఠీ కానీ బాట్స్మెన్ తో కానీ సంబంధం లేదు. ఎదుట ఎవరున్నారన్నది ప్రస్తావన కాదు, ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాము అనే సమస్యే లేదు. వికెట్లు తియ్యడమే జస్ప్రీత్ ముందున్న లక్ష్యం. అయితే బుమ్రా బాల్యం కష్టాలు అవమానాల నడుమే నడిచింది.
ఏడేళ్ల ప్రాయంలోనే బుమ్రా తండ్రిని కోల్పోయాడు. తల్లి కష్టపడి పెంచి పోషించింది. చిన్నప్పటి నుండే క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. తల్లి వద్దన్నా వినలేదు. బుమ్రా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జన్మించాడు.
వీరిది పంజాబీ కుటుంబం అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ బుమ్రా పుట్టడానికి ముందే గుజరాత్ లో సెటిల్ అయ్యారు. బుమ్రా తల్లి అక్క ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుండి బుమ్రా కి బౌలింగ్ పైనే మోజు ఎక్కువ, బౌలింగ్ లో ఫాస్ట్ గా ఉండే బుమ్రా చదువులో మాత్రం యావరేజ్ స్టూడెంట్ మాత్రమే.
సాధారణ మధ్యతరగతి కుటుంబంలోని ఏ స్త్రీ అయినా కోరుకునేది వారి పిల్లలు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చెయ్యాలని, లేదంటే ఇంకా బాగా చదువుకుని ఫారెన్ వెళ్లి సెటిల్ అవ్వాలని డాలర్స్ సంపాదించాలని కలలు కంటారు.
అందులోను భర్తను కోల్పోయిన భార్యలు తమ పిల్లల విషయంలో ఇంకాస్త ఎక్కువ ఊహించుకుంటారు. అందుకే జస్ప్రీత్ తల్లి దల్జీత్ కూడా బుమ్రాను క్రికెట్ గ్రౌండ్ కి దూరంగా క్లాస్ రూమ్ కి దగ్గరగా ఉంచాలని అనుకుంది.
అయితే అది సాధ్యపడలేదు కాబట్టే ఇప్పుడు అతను అంతర్జాతీయ స్టేడియం లలో బౌలింగ్ చేస్తున్నాడు. కొడుకు తపన చుసిన తల్లి మొత్తానికి క్రికెట్ ప్రాక్టీస్ కి ఒప్పుకుంది, తన కలను నెరవేర్చుకోవడానికి బుమ్రా రోజుకి 14 గంటలపాటు ప్రాక్టీస్ చేసేవాడు.
ఇక్కడే అసలు కీలకం ఉంది, అతని బౌలింగ్ యాక్షన్ మిగిలిన వారందరికన్నా భిన్నంగా ఉండేది. అది గమనించిన స్కూల్ కోచ్ అతడిని బాగా యాంకరేజ్ చేశాడు.
బుమ్రా బౌలింగ్ చూసి ఎం.ఆర్.ఎఫ్ పేస్ ఫౌండేషన్ వారు అతనికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంపిక చేశారు. అందులో శిక్షణ ఇచ్చింది ఆషామాషీ ఆటగాడు కాదు, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ వీరికి తర్ఫీదు ఇచ్చాడు. అక్కడ కూడా బుమ్రా కి మంచి పేరొచ్చింది.
తన బౌలింగ్ కి గుర్తింపు దక్కింది. అతను పడిన శ్రమ అతనికి ఒక అవకాశాన్ని కల్పించింది. 2012 గుజరాత్ అండర్ 19 లో చోటు దక్కింది. అదే సంవత్సరం జరిగిన స్మార్ట్ టోర్నమెంట్ లో తమ జట్టు ఫైనల్ కి వెళ్లేందుకు ఇతని బౌలింగ్ బాగా దోహదపడింది.
మరో విశేషం ఏమిటంటే పంజాబ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కేవలం 14 పరుగులకే 3 వికెట్లు పడగొట్టేశాడు. ఇలాంటి చిన్న చిన్న విజయాలే బుమ్రా కి బంపరాఫర్ తగిలేలా చేశాయి.
కొత్త టాలెంట్ ను డేగకళ్లతో పసిగట్టే ముంబై ఇండియన్స్ కళ్ళలో పడ్డాడు బుమ్రా. దీంతో 2013 లో ఐపీఎల్ కి ఆడే ఛాన్స్ కొట్టేశాడు. అన్నప్రాసన రోజునే ఆవకాయ తినేసినట్టు 2013 వ సంవత్సరంలో ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసిన రోజునే తోలి ఓవర్ లోనే విరాట్ కోహ్లీ వికెట్ తీసి వారెవ్వా అనిపించాడు.
ఆ మ్యాచ్ లో విరాట్ వికెట్టే కాక మరో రెండు వికెట్లు పడగొట్టాడు. అదే 2013 లో బుమ్రా కి విదర్భ మీద ఆడే అవకాశం ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో దక్కించి. ఈ మ్యాచ్ లో అయితే ఏకంగా ఏడు వికెట్లు తీసేసి ఆశ్చర్యపరిచాడు. ఇక మరుసటి ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ 1.2 కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసింది.
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టు, అంతా సజావుగా సాగుతోంది అనుకున్న సమయంలో బుమ్రా గాయపడ్డాడు. అది 2015 ఐపీఎల్ లో అతని ఆటతీరు పై ప్రభావం చూపింది.
గతంలో మాదిరిగా ఆట ఆడలేకపోయాడు. మునుపటి దూకుడు ప్రదర్శించలేకపోయాడు. కానీ 2016 స్మార్ట్ టోర్నీకి మాత్రం ఫిట్ అయ్యాడు. బుమ్రా ఈస్ బ్యాక్ అంటూ వీర విహారం చేసి వికెట్లు పడగొట్టాడు. దీంతో బీసీసీఐ ఆస్ట్రేలియా టూర్ కి బుమ్రా ను సెలెక్ట్ చేసింది.
అదే సంవత్సరంలో ఆస్ట్రేలియా మీద టి 20 కి కూడా కాలు దువ్వాడు. అక్కడి నుండి బుమ్రా వెనుతిరిగింది లేదు, ఒక సంవత్సరంలో ఇత్యధిక సంఖ్యలో వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించారు. ఇప్పటికి తనదైన బౌలింగ్ తో క్రికెట్ ప్రియులను మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఒక సామాన్యుడు క్రికెట్ లో ఈ స్థాయికి వచ్చాడంటే క్రిటిక్స్ వారి కలానికి పనిచెప్పకుండా ఉంటారా ? ఆందుకే అతని బౌలింగ్ గురించి ఇష్టం వచ్చినట్టు రాసేశారు. అతడు టెస్ట్ క్రికెట్ కి సెట్ అవ్వడని, అతని బౌలింగ్ యాక్షన్ వల్ల తరచూ గాయ పడతాడని పేర్కొన్నారు.
కానీ బుమ్రా ఆ రథాలని పిచ్చిరాతలని సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో ప్రూవ్ చేశాడు. మూడు మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ లో 14 వికెట్లు తీసుకున్నాడు.
ఇక పర్సనల్ లైఫ్ విషయాలు చుస్తే అతనికన్న రెండేళ్ల పెద్దదయిన సంజన గణేశన్ ను పెళ్లాడాడు. కొన్ని వెబ్ సైట్లలో బుమ్రా గురించి రూమర్లు వినిపించాయి.
బుమ్రా కి మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, ఢిల్లీ సుందరి రాసి ఖన్నా తో ప్రేమాయణాలు ఉన్నట్టు కధనాలు వెలువడ్డాయి. బుమ్రా కేవలం క్రికెట్ ప్రేమికుడి కాదు ప్రక్రుతి ప్రేమికుడు కూడా. అతడు వీలుకుదిరినప్పుడల్లా మొక్కలు నాటుతూ ఉంటాడు.