ప్రపంచ నంబర్.1 బౌల‌ర్ గా జస్ప్రీత్ బుమ్రా. రికార్డ్ : Jasprit Bumrah as world no 1 bowler Record.

website 6tvnews template 29 ప్రపంచ నంబర్.1 బౌల‌ర్ గా జస్ప్రీత్ బుమ్రా. రికార్డ్ : Jasprit Bumrah as world no 1 bowler Record.

Jasprit Bumrah as world no 1 bowler Record : ఇటీవల వైజాగ్ జరిగిన రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసుకుని బుమ్రా టీమిండియా గెలుపులో కీల‌క పాత్ర పోషించాడనే చెప్పాలి .

దీని ద్వారా అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ తో సరికొత్త చ‌రిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో నంబ‌ర్.1 బౌల‌ర్ గా నిలిచాడు. దీంతో టెస్టు క్రికెట్, వ‌న్డే క్రికెట్, టీ20 క్రికెట్.. ఇలా మూడు ఫార్మాట్ ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు నెంబ‌ర్.1 బౌల‌ర్ గా నిలిచిన ప్లేయ‌ర్ గా ఘ‌నత సాధించాడు.

ఇదివ‌ర‌కు తొలి స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానం తో సరేపెట్టుకోవాల్సి వచ్చింది. బుమ్రా విశాఖ‌ప‌ట్నంలో టెస్టులో అద్భుత‌మైన బౌలింగ్ తో రెండు స్థానాలు ఎగ‌బాకి అగ్ర‌స్థానంలో చేరాడు.

బుమ్రా మొత్తం 881 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (851 రేటింగ్స్) కంటే ముప్పై రేటింగ్ పాయింట్ల అధికంతో తొలి స్థానంలో నిలిచాడు. ర‌బాడ రెండో స్థానంలో ఉన్నాడు. టాప్ 10 టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో బుమ్రాతో పాటు అశ్విన్ (841 రేటింగ్స్), రవీంద్ర జడేజా (746 రేటింగ్స్) ఉన్నారు.

ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్:

  • జస్ప్రీత్ బుమ్రా (881)
  • కగిసో రబడ (851)
  • రవిచంద్రన్ అశ్విన్ (841)
  • పాట్ కమిన్స్ (828)
  • జోష్ హేజిల్‌వుడ్ (818)
  • ప్రభాత్ జయసూర్య (783)
  • జేమ్స్ ఆండర్సన్ (780)
  • నాథన్ లియోన్ (746)
  • రవీంద్ర జడేజా (746)
  • ఆలీ రాబిన్సన్ (746)

Leave a Comment