లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార బీజేపీ, ప్రత్యర్థి కాంగ్రెస్ మధ్య వేడి రాజుకుంటోంది. ఈ క్రమం లోనే BJP అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయన ఏకంగా స్వాతంత్య్రం తరువాత భారత తోలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు నెహ్రు కు సున్నా ఓట్లు మాత్రమే వచ్చాయని, అయినప్పటికీ నెహ్రు భారత దేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారని చెప్పారు.
అంతే కాక మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. అయన ఏం చెబుతున్నా, దాని అసలు ఆంతర్యం మరొకటి ఉంటుందని అన్నారు, వంశపారంపర్య రాజకీయాలను ఓటర్లు విస్మరించారు మరియు నిజమైన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన ఆవిర్భావం ఇప్పుడు ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అంటే సుధాన్షు మాటలను చూస్తుంటే రాహుల్ గాంధీ ప్రధాని అవడాన్ని ఆయన వ్యతిరేకించినట్టు స్పష్టంగానే అర్ధం అవుతోంది. పైగా దేశ ప్రజలు కూడా రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు సిద్ధంగా లేరని నర్మగర్భంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.