Jayaprada Arrest warrant: అంతులేనికథ కష్టాలలో జయప్రద – మరలా అరెస్ట్ వారెంట్..

website 6tvnews template 63 Jayaprada Arrest warrant: అంతులేనికథ కష్టాలలో జయప్రద - మరలా అరెస్ట్ వారెంట్..

అంతులేని కథ సినిమాలో జయప్రద కు సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు కష్టాలు ఉంటూనే ఉంటాయి. ప్రస్తుతం జయప్రద పరిస్థితి చూస్తే ఆ అంతులేని కథ సినిమా మాదిరిగానే ఉందని అనిపిస్తోంది. ఒక కేసులో అరెస్ట్ వరకు వెళ్లిన ఆమె దాని నుండి బయట పద్ధతులే అనుకుంటే ఇప్పుడు ఆమెను మరో కేసు వంటాడుతోంది. ఈ మాజీ ఎంపీని ప్రస్తుతం కేసుల సమస్యలు చుట్టుముట్టాయని చెప్పాలేమో.

ప్రజాప్రతినిధుల కోర్టు ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది.వివరాల్లోకి వెళ్తే, 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో జయప్రద భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ నుంచి పోటీ చేశారు. అయితే ఎన్నికల నియమావళిని జయప్రద ఉల్లంఘించారంటూ ఆ సమయంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన విచారణను ప్రజాప్రతినిధుల కోర్టు నిర్వహిస్తున్నారు.

అయితే జయప్రదను కోర్టుకు హాజరు కావాలంటూ పలుమార్లు నోటీసులు జారీ చేశారట. కానీ ఆమె ఆ నోటీసులకు ఎంతమాత్రం స్పందించలేదని తెలుస్తోంది.నోటీసులకు స్పందన లేకపోవడం, పైగా కోర్టు కి హాజరుకాకపోవడం వంటి కారణాలతో గతంలో ఒక పర్యాయం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు జయప్రదకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా పోలీసులు జయను అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు లో వాదించారు.

2023 ఆగస్టు లో జయప్రదకు చెన్నై ఎగ్మోర్ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒక కేసు విషయంలో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది. చెన్నైలోని రాయపేటలో గల ఓ సినిమా థియేటర్ ను ఆమె తన సన్నిహితులతో కలిసి నిర్వహిస్తుండేవారు, అయితే థియేటర్‌లో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్‌ఐ సొమ్ము చెల్లించలేదనే కారణంగా ఆమెపై కేసు నమోదైంది.

Leave a Comment