Breaking News

JCB Accident : 300 మీటర్ల ఎత్తు నుండి పడిపోయిన జేసీబీలు ప్రమాదం.

Mining Department on the accident of JCBs falling from a height of 300 meters

JCB Accident : 300 మీటర్ల ఎత్తు నుండి పడిపోయిన జేసీబీలు..కేసునమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదంపై మైనింగ్ శాఖా ఎందుకంత సీరియస్..

ములుగు జిల్లా మల్లంపల్లి లో విచారకర ఘటన చోటుచేసుకుంది. మల్లంపల్లి క్రషర్​లో ఆదివారం నాడు సంభవించిన ప్రమాదంలో ఒడిశా, బిహార్​ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వలస కూలీల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 300 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపై రెండు ఎక్స్​కవేటర్లు పనిచేస్తున్నాయి.

ఈ క్రమంలో వాటి కింద ఉన్న బండరాయి కుండగడంతో అవి ఒక్కసారిగా కిందపడిపోయాయి. ఈ క్రమంలో జెసిబి లపై అత్యంత బరువైన బండరాళ్లు పడిపోవడంతో అందులో ఉన్న వారు ప్రాణాలు కోల్పోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే బిహార్​లోని బక్సర్​ జిల్లాకు చెందిన పరమేశ్వర్​ యాదవ్, ఒడిశా రాష్ట్రం రాయఘడ్​ జిల్లాకు చెందిన జక్తు మజి అనే ఇద్దరు వ్యక్తులు మహ్మద్ ​గౌస్​పల్లిలోని సహ్యాద్రి స్టోన్​ క్రషర్ లో జెసిబి ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు.

ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో గుట్టపై రాళ్లను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే జేసీబీలు క్రింద ఉన్న బండరాయి కుంగడంతో వారిని మృత్యువు కబళించింది.

ప్రమాదాన్ని గమనించిన తోటి కూలీల జెసిబిలపై పడిన బాండ రాళ్లను తొలగించి కింద ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీశారు.

ఏ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని, ప్రమాదం జరిగిన తీరుని పోలీసులు పరిశీలించారు.

క్వారి లో పనిచేస్తున్న సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు కేసునమోదుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆదివారం నాడు కార్మికులను పనిలోకి పిలవడంపై మైనింగ్ మరియు కార్మిక శాఖలు సీరియస్ అవుతున్నాయి.

కేవలం ఆదివారం మాత్రమే కాక దీపావళి పండుగ కూడా కావడంతో వారు క్వారీ యాజమాన్యంపై మరింత ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఇక పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతే కాకా మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *