Jitesh Replace Rishab pant: రిషబ్ పంత్ స్థానంలో లో జితేష్ – జితేష్ దెబ్బకి ఆ నలుగురు హడల్.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ లో భారత్ వీర విహారం చేసింది. వన్డే వరల్డ్ కప్ కి బదులు తీర్చుకోవాలనే కసితో భారత్ విజృంభించినట్టు అర్ధమవుతోంది. ఈ టి 20 సీరీస్ ను 4 -1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
ఏ సంగతి ఇలా ఉంచితే ఇప్పుడు తాజాగా ఆఫ్రికా టూర్‌పై ఇండియా ప్రత్యేక దృష్టి పెట్టింది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని టీ20 జట్టును బలంగా నిర్మించే విషయంలో బీసీసీఐ సఫలీ కృతమైందని చెప్పొచ్చు. కంగారూలకు వ్యతిరేకంగా యువ ఆటగాళ్ల బృందాన్ని రంగంలోకి దిందింపింది.
ఈ సిరీస్‌లో యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, జితేష్ శర్మ, తిలక్ వర్మ, ముఖేష్ కుమార్‌లతో సహా పలువురు యువ ఆటగాళ్ల టాలెంట్ ను భారత్ బాగా ఉపయోగించుకుంది.
పైగా ప్లేయర్స్ అంతా కూడా బీసీసీఐ ఇచ్చిన ఛాన్స్ ను చక్కగా వాడుకున్నారు. ప్రస్తుతానికి మన ఆటగాళ్లు పాక్షికంగా విజయం సాధించారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా జితేష్ శర్మ గతంలో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోను అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు.
జితేష్ శర్మ జట్టులోకి రావడంతో మిగిలిన నలుగురు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్‌లలో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టీ20 మ్యాచ్ లను ఉదాహరణగా తీసుకోవచ్చు.
ఈ లాస్ట్ రెండు మ్యాచ్లలో ఆడిన జితేష్ నాలుగవ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. జస్ట్ 19 బాల్స్ లో 1 బౌండరీ, 3 సిక్సర్లతో 35 పరుగు సాధించాడు. ఇతని ఆట తీరు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఇక చివరి మ్యాచ్ లో కూడా తక్కువేం తినలేదు. అందులో 24 ట్రాన్స్ కొట్టాడు ఈ యువ ఆటగాడు.
పైగా జితేష్ జట్టు విజయం సాధించడానికి ప్రధాన పాత్ర పోషించాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ లో జరగబోయే ప్రపంచకప్‌లో టి 20లో జితేష్ కి ఛాన్స్ ఇస్తే అది మంచి నిర్ణయం అవుతుందని క్రికెట్ ప్రియులతో పాటు విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
ఇక ఇషాన్ కిషన్ విషయానికి వస్తే, ఇతడు 3 టీ 20 మ్యాచులు ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. బీసీసీఐ తనకు ఇచ్చిన ఛాన్స్ ను సరిగ్గా వాడుకోలేకపోయాడని చెప్పొచ్చు. 3 మ్యాచుల్లో ఆడే అవకాశం రాగా రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు.
ఇషాన్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ అలాగే ఫీల్డింగ్ కూడా చేస్తాడు. అయితే పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతోనే ఇతడి స్థానాన్ని జితేష్ తో భర్తీ చేశారు.
అయితే జితేష్ మాత్రం వచ్చిన ఛాన్స్ ను చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. మెరుపులు మెరిపించే ఆట తీరు చూపెట్టి జట్టులో శాశ్వతంగా సెటిల్ అవుతాననే సంకేతాలు పంపించాడు.
ఇప్పటికే టీమిండియా టి 20 కోసం ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్ లు అటు వికెట్ కీపర్లు గా ఇటు బాటర్లుగా బాగానే రాణిస్తున్నారు. ఇప్పడు సడన్ గా జితేష్ ఎంట్రీతో వారు అప్రత్తమవ్వాల్సిందే అన్నట్టు సూచలిచ్చాడు జితేష్.
ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే అతడు ఈ ఇయర్ స్టార్టింగ్ లో భారీ రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. ఆల్మోస్ట్ మృత్యువు నోట్లో తలపెట్టి బయటకు వచ్చాడు. అయితే ఎలాగైనా ఫిట్ నెస్ సాధించి, తానూ ఫిట్ టు ప్లే అని ప్రూవ్ చేసుకుని వచ్చే ఏడాది జరగనున్న టి 20 లో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాడు.
ఒక వేళ పంత్ గనుక తాను టి 20 ఆడేందుకు 100 % ఫిట్ అని నిరూపించుకోలేకపోతే ఆ స్థానాన్ని జితేష్ తన్నుకుపోవడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ఇక కె.ఎల్ రాహుల్ వ్యవహారం చూద్దాం, జనరల్ గా రాహుల్ ఓపెనర్ గా ఎక్కువగా కనిపిస్తున్నాడు. కానీ రాహుల్ లోయర్ ఆర్డర్ లో అనుకున్న స్థాయిలో
రాణించలేకపోతున్నాడు. దీని వల్ల అతని బెర్ట్ గల్లంతు అయ్యే ప్రమాదం ఉంది. రాహుల్ తన ఆటతీరును సరిచేసుకుని, పరుగుల వరద పారించకపోయినా, బాల్ ను బౌండరీలు దాటించకపోయినా అతని స్థానంలోకి జితేష్ ఎంటరయ్యే ఛాన్స్ ఉంది.
ఈ విషయంలో రాహుల్ మాత్రమే కాదు ఇషాన్ కిషన్ కూడా లోయర్ ఆర్డర్ లో విఫలం అవుతున్నాడు. ఆటను లోయర్ ఆర్డర్ లో తరచూ విఫలం అవుతున్నాడు. ఆ కారణంగానే అతడిని ఓపెనర్ గా కానీ లేదంటే టాప్ 3 లో గాని దిగుతున్నాడు.
ఇక ఇండియన్ టీమ్ లో టాప్ ఆర్డర్ కోసం గట్టి పోటీనే ఉంది, సంజూ శాంసన్ లో టాలెంట్ కి తక్కువేం లేదు, అయితే తన టైం బాలేదు ఏమో కానీ ఇతగాడు ఈ మధ్య మెరుగైన ఆటతీరు చూపెట్టలేకపోతున్నాడు.
అందుకే అతడికి టి 20 టీమ్ లోని పర్మినెంట్ గా నో ఎంట్రీ బోర్డు పెట్టెలా ఉంది బీసీసీఐ. ఇది కూడా జిటిష్ కి కలిసి వచ్చే అంశమే, ఒకవేళ సంజు టీమ్ నుండి అవుట్ అయితే ఆ ప్లేస్ ను జితేష్ ఆక్రమించేస్తాడు.