Job Mela in Mallepally: మల్లేపల్లి లో జాబ్ మేళా.

Job fair in Mallepally.

Job Mela in Mallepally: మల్లేపల్లి లో జాబ్ మేళా.

ఎన్ని కొత్త కంపెనీలు పుట్టుకొచ్చిన నిరుద్యోగం అనేది తీరని సమస్యగానే పరిణమిస్తోంది. చదువుకున్న వారికి వారి అర్హతకి తగిన ఉద్యోగం దొరక్క అనేకమంది నానా అవస్థలు పడుతున్నారు.

కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలనే లక్ష్యంగా చేసుకుని వాటికోసమే ఎదురుచూస్తూ ఉంటారు. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతూ ఉంటారు. కొందరు మాత్రం ప్రయివేటు ఉద్యోగాలను ఎదుకుతు కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ఉంటారు.

ఇలా ఉద్యోగాల వేటలో ఉన్నవారికి బాగా ఉపయోగపడేవే జాబ్ మేళాలు, ఈ జాబ్ మేళా లో కంపెనీలు స్వయంగా ఒక చోటికి వచ్చి, అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని ఇంటర్వ్యూ చేసి అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేసుకుంటున్నాయి.

ఇక ఈ జాబ్ మేళాలను (Job fair) కొన్ని సందర్భాల్లో స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేస్తాయి, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా ఏర్పాటుచేస్తాయి.

అయితే డిసెంబర్ 29 వ తేదీన హైదరాబాద్ జిల్లా మల్లేపల్లిలో(Mallepalli) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పనా అధికారి మైత్రి ప్రియ ప్రకటించారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ ఈ జాబ్ మేళా లో మూడు కంపెనీలు పాల్గొంటాయని,

ఆశక్తి గల అభ్యర్థులు వారి బయోడేటా ఇంకా సర్టిఫికెట్లతొ(Cirtificates) జాబ్ మేళాకి హాజరు కావచ్చని అన్నారు. ఈ జాబ్ మేళా లో పాల్గొనేందుకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పిజి వంటి ఏదైనా అర్హత కలిగిన వారు

ఉదయం 10 గంటలకు మల్లేపల్లి లోని జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. దీనికి సంబంధించి ఇతర వివరాలు జాబ్ మేళా వెబ్ సైట్ లో ఉంటాయని అన్నారు.

Leave a Comment