Breaking News

Joe Biden: You will be shocked if you know what Biden said to Kamala Haris కమలా హరీస్ ను బైడెన్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు..

కమలా హరీస్ ను బైడెన్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు..

Joe Biden : తడబాటు పడుతున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు..కమలా హరీస్ ను బైడెన్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు..

పాలు తాగే చంటి పిల్లలు మాత్రమే కాదు అప్పుడప్పుడు, దేశాలను పాలించే నేతలు కూడా మాటలు తడబడుతూ ఉంటారు. అయితే చంటి పిల్లలు మాటలు తడబడితే ముద్దు ముద్దుగా ఉంటాయి కానీ, నేతలు మాట తడబడితే మాత్రం నవ్వుల పాలవుతారు.

ఇప్పటికే ఈ విషయంలో కొందరు నాయకులు తీవ్రంగా ట్రోలింగ్ అయ్యారు. కొందరు ఇప్పటికి ట్రోలింగ్ అవుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఈ తడబాటు తమకు రాదనుకుని విర్రవీగిపోయి, ప్రత్యెర్ధి పార్టీ వారిని దద్దమ్మ అని, గేలి చేసిన నేతల నాలుకలు కూడా మెలికలు తిరిగిపోయాయి. వారు కూడా ప్రత్యర్థుల చేతికి చిక్కారు.

ఇక తాజాగా ఇలా పొరపాటు మాటలు దొర్లించేసి నాలుక కర్చుకున్న నేతఎవరో తెలుసా, ఏకంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్. అయితే అయన తడబాటు పడి తప్పులు మాట్లాడటం ఇది తెలిసారి కాదట, అది ఒక అరడజను సార్లు దాటిపోయింది అంటున్నారు అక్కడివారు.

ఫ్రెష్ ఇన్సిడెంట్ తీసుకుంటే అయన వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో పొరపాటున, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ‘అధ్యక్షుడు’ అని చెప్పారట. ఇది విన్న వారంతా అవాక్కయ్యారట.

మరి అధ్యక్షుడు స్థానంలో ఉన్న వ్యక్తి మరో వ్యక్తిని అధ్యక్షుడు అని సంబోధిస్తే, అందులోను మహిళను అధ్యక్షుడుగా సంబోధిస్తే ఆ వీడియో వైరల్ అవ్వకుండా ఉంటుందా..? అది యమా ఫాస్ట్ గా వైరల్ అయిపొయింది.

గత జూన్‌లో స్టాన్లీ కప్ గెలిచిన వెగాస్ గోల్డెన్ నైట్స్‌ టీమ్‌ను సత్కరించే కార్యక్రమాన్ని శ్వేత సౌధం లో ఏర్పాటుచేయగా అక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోను కొందరు ట్రోల్ చేస్తున్నారు.

ఆయనకు ప్రెసిడెంట్ ఎవరో కూడా తెలియదు అని కొందరు అంటుంటే, అబ్బా, బైడెన్ ఎం జోక్ చేస్తున్నారు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. బైడెన్‌ ఇలా నోరుజారి నవ్వులపాలు అవ్వడం కొత్తకాదు. ఒక సందర్భంలో హ్యారిస్‌ను ప్రధమ మహిళ అని కూడా అనేశారు బైడెన్.

పోయిన సంవత్సరం కమలా హరీస్ పుట్టిన రోజు వేడుకను వైట్ హౌస్ లో ఏర్పాటుచేయగా, ఆమె గురించి మాట్లాడుతూ ఆమె అసాధారణ అధ్యక్షురాలు అంటూ బైడెన్ పొగిడేశారు.

కానీ ఆమె ఉపాధ్యక్షురాలు అని గుర్తొచ్చేలోపే జగరాల్సిన అనర్ధం జరిగిపోయింది. అయన నోరి జారిన విషయం నలుగురికి తెలిసిపోయింది.

అంతే కాదు యువతి అయిన ప్రముఖ రాపర్, ఎల్ఎల్ జై కూల్ జే గురించి మాట్లాడుతూ, అబ్బాయి అని చెప్పాడు. అమ్మాయిని పట్టుకుని అబ్బాయి అనడంతో మరోసారి పొరపాటు పడ్డాడు బైడెన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *