Jr.N.T.R. దేవర నిరవధిక వాయిదా – విడుదల అయ్యే రోజు ఎప్పుడంటే

Jr NTR in Devara new poster Jr.N.T.R. దేవర నిరవధిక వాయిదా - విడుదల అయ్యే రోజు ఎప్పుడంటే

ఈ సంవత్సం ఏప్రిల్ 5 న Jr.N.T.R. నటించిన దేవర మూవీ విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ విషయం మీద మొదటి నుండి అనేక అనుమానాలు ఉన్నాయి అసలు ఆ రోజు విడుదల అవుతుందా అని.

ఇప్పుడు అదే నిజం అయింది. ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ సినిమాకి సంబందించి కొన్ని విషయాలు వివరించి చెప్పింది ఎందుకు వాయిదా వేయవలసి వచ్చింది అని. కొన్ని అనుకోని సమస్యలు ఎదురు అయ్యాయని అందుకని 6 నెలలు వాయిదా వేయవలసి వచ్చింది అని ఆ వివరాలు తర్వాత అందిస్తామని చెప్పింది.

అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 11 నుండి దసరా నవరాత్రులు ప్రారంభం అవుతాయని అప్పుడు విడుదల చేస్తే కలెక్షన్స్ పరం గ కూడా లాభాలు వస్తాయని అందుకని అప్పుడు ప్లాన్ చేసామని చెప్పారు. ఈ మూవీ కి కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అసలు మొదట ఒక పార్ట్ గానే అనుకున్నామని కాని కధా పరం గా రెండు పార్ట్ లు గ చెయ్యాలని నిర్ణయించామని మూవీ మేకర్స్ చెప్పారు. ఇందులో శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి హీరోయిన్ గ నటిస్తుంటే ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ గా చేస్తున్నట్లు నిర్మాతలు చెపారు. ఏది అయితేనే ఈ మూవీ కోసం దసరా వరకు ఆగాల్సిందే.

Leave a Comment