ప్రభాస్ వల్ల అయోమయం లో పడిపోయిన Jr.ఎన్టీఆర్ నెక్స్ట్ ఎం చేస్తాడు : ప్రభాస్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అయోమయం పడ్డారా..? అంటే అవును అంటున్నాయి సిని వర్గాలు. నాన్నకు ప్రేమతో లో చెప్పినట్లు బటర్ ఫ్లై ఎఫెక్ట్.. తాజాగా తారక్‌పైనే పడిందా అంటే జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి.ఫ్యూచర్ గురించి ఊహించకుండా..కెరీర్‌ను తానే డేంజర్ జోన్‌లోకి నెట్టేసుకున్నారా..?
చేతిలో ఉన్న దర్శకుడిని స్నేహితుడికి ఇచ్చేయడంతో.. తారక్ కన్ప్యూజన్‌లోకి వెళ్లిపోయారా..? అసలు జూనియర్ ప్లానింగ్ ఏంటి..? నిజంగానే ఎన్టీఆర్ విషయంలో జరుగుతుంది ఇదే అనిపిస్తోంది చూస్తుంటే. పాపం ఆయనకు తెలియకుండానే కెరీర్‌ను కన్ఫ్యూజన్‌లోకి నెట్టేసుకున్నారు యంగ్ టైగర్ అనే చెప్పాలి. నిన్నమొన్నటి వరకు బిజీగా ఉన్నట్లు కనిపించారు తారక్. కానీ అవన్నీ కేవలం పేపర్‌కే పరిమితం అయ్యాయి.
దేవర తర్వాత నెక్ట్స్ ఏంటి అంటే చెప్పలేని పరిస్థితి వచ్చేసిందిప్పుడు. నిజానికి కొరటాల శివతో చేస్తున్న దేవర, అలాగే ప్రశాంత్ నీల్‌తో పాటు బుచ్చిబాబు లకు కూడా కమిట్మెంట్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళు మాత్రమే కాకుండా.
అట్లీ, వెట్రి మారన్ అంటూ లిస్టు పెద్దగానే కనిపించింది. కానీ ఇదంతా నిన్నటి వరకు..! సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే సలార్ 2 కోసం మరో ఏడాది వరకు అక్కడే లాక్ అయిపోయారు ప్రశాంత్ నీల్. సలార్ 2 ప్రభావం జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ పై పడింది.
మరోవైపు ఈ ఏడాది అంతా తారక్ దేవరతోనే బిజీగా ఉండేలా ఉన్నారు . మధ్యలో వార్ 2కు డేట్స్ ఇచ్చినా.. అది తెలుగు కాదు. మరి తర్వాత ఏంటి అన్నది తారక్ మీదే ఆధారపడి ఉంది
అంతే కాడు ఈ మూవీ లో హృతిక్ రోషన్‌తో కలిసి నటించబోతున్నారు తారక్. దేవర పార్ట్ 1 అయ్యాక.. వార్ 2 మొదలు కానుంది. దీని తర్వాత దేవర 2కు డేట్స్ ఇచ్చారు యంగ్ టైగర్. మరి ఎప్పుడు ఎలా ఉంటుందనేది ప్రశాంత్ నీల్ , బుచ్చిబాబు చెప్తే కాని క్లారిటీ రాదు .
బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్‌తోనే చేయాల్సి ఉన్నా.. అది కాస్తా రామ్ చరణ్‌కు షిఫ్ట్ అయింది. ప్రశాంత్ నీల్ మూవీ ఉందనే.. బుచ్చిబాబు మూవీ వదిలేసారు తారక్. కానీ ప్రభాస్ కోసం అదే ప్రశాంత్ నీల్ ప్లాన్ మార్చారిప్పుడు. దాంతో దేవర తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడిపోయినట్లే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక మూవీ ఉందంటున్నా.. అదెప్పుడో ఎవరికీ క్లారిటీ లేదు. మొత్తానికి ఫ్రెండ్స్ కోసం చేతిలో ఉన్న దర్శకులను వదిలేసారు ఎన్టీఆర్. చూద్దాం ఎం జరుగుతుందో