ఎన్టీఆర్‌ లుక్ ఛేంజ్..అందుకోసమే స్పెషల్‌ ట్రైనింగ్

website 6tvnews template 2024 04 03T165221.329 ఎన్టీఆర్‌ లుక్ ఛేంజ్..అందుకోసమే స్పెషల్‌ ట్రైనింగ్

Jr NTR to join fitness course for war 2 : యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR)ప్రస్తుతం కొరటల శివ (Koratala Shiva) డైరెక్షన్ లో రూపొందుతున్న ‘దేవర’ (Devara)షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ మధ్యనే తారక్ గోవాలో కొన్ని సీన్స్ షూట్ చేశాడు. దేవరతో పాటు తారక్ బాలీవుడ్ మూవీ ‘వార్‌ 2’ (war2)లో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్‌ డెబ్యూ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో తారక్‌ బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్ రోషన్‌ (Hrithik Roshan)తో కలిసి నటిస్తున్నాడు. వార్ 2లో తారక్ క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్ చల్ చేస్తుంది.

తాజాగా తారక్ తన లుక్ ను మార్చుకునేందుకు ప్రత్యేకంగా స్పెషల్ కోర్స్ కూడా చేయబోతున్నాడని సమాచారం. ఈ వార్త తెలియడంతో తారక్ లుక్ గురించి ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

స్పెషల్ కోర్స్‎లో చేయనున్న ఎన్టీఆర్ :

‘వార్‌ 2’ (War2) తారక్ బాలీవుడ్ ఫస్ట్ మూవీ. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్టీఆర్ (NTR) సుపరిచితమే. దీంతో టాలీవుడ్ తో పాటు బి-టౌన్‌ ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. తారక్‌ వార్ 2 సెట్‌లో ఎప్పుడెప్పుడు అడుగుపెడుతాడా అని ఫ్యాన్స్‌ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా కోసం ఎన్టీఆర్‌ మేకోవర్‌ చేయించుకోబోతున్నాడట. తన క్యారెక్టర్ కు తగ్గట్లుగా పవర్‎ఫుల్‎గా కనిపించేందుకు ఎన్టీఆర్‌ ఫిట్‌నెస్‌గా ఫోకస్ పెట్టాడట. తన లుక్ కోసం తారక్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకోబోతున్నాడని టాలీవుడ్ టాక్.

వరల్డ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ట్రైనర్ దగ్గర తారక్‌ స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకోబోతున్నాడని సమాచారం. రెండు వారాల పాటు ఈ ఫిట్‌నెస్‌ కోర్స్‌ ఉంటుందని టాక్. ఈ మూవీలో హృతిక్ రోషన్‌ (Hrithik Roshan)తో పాటు తారక్‌ కి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. సోషల్ మీడియా టాక్ ప్రకారం వార్ 2లో ఎన్టీఆర్‌ గుఢాచారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.

ఆగస్ట్ 14న వార్ 2 :

YRF స్పై యూనివర్స్ బ్యానర్లో వార్2ను ‘బ్రహ్మాస్త్ర’(Bramhmastra)ఫేమ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukharjee) తెరకెక్కిస్తున్నాడు. గతంలో విడుదలైన వార్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ (Siddarth Anand) డైరెక్ట్ చేశాడు.

అయితే సీక్వెల్‌గా వస్తున్న ‘వార్‌ 2’ను తెరకెక్కించే బాధ్యతను అయాన్‌ ముఖర్జీ తీసుకున్నాడు. ఈ మూవీ 2025 ఆగస్ట్ 14వ రిలీజ్ కానుందని మేకర్స్ అనైన్స్ చేశారు. అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేసేందుకు టీం ఎంతో కష్టపడి పనిచేస్తోంది.

ఇప్పటికే సెట్‌లో హృతిక్ రోషన్ (Hrithik Roshan)షూట్ స్టార్ట్ అయింది. అయితే స్పెయిన్‌లో జరిగిన యాక్షన్‌ సీన్స్‌లో ఆయన గాయపడ్డాడు. గాయం కారణంగా కాస్త బ్రేక్ తీసుకున్నాడు. హృతిక్ త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టబోతున్నాడు.

Leave a Comment