Devara : ఎన్టీఆర్ నడిచొస్తుంటే ఉంది భయ్యా …’దేవర’ వీడియో లీక్..

Screenshot 2024 03 22 153011 Devara : ఎన్టీఆర్ నడిచొస్తుంటే ఉంది భయ్యా …'దేవర' వీడియో లీక్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్ గా కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ దేవర (Devara).రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా షూటింగ్ నుంచి ఓ వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఆ లీకైన వీడియో ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లుంగీ లుక్ లో ఎన్టీఆర్ :

దేవర (Devara)సినిమాను ఈ ఏప్రిల్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ ని వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ గోవా (Goa)లో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా ఎన్టీఆర్ (NTR) గోవాలో హల్ చల్ చేస్తున్నాడు. గోవా సముద్రం ఒడ్డున ఒక పాటను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇక ఆ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ సముద్రం ఒడ్డున లుంగీ లుక్ లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ వీడియోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ :

దేవర(Devara)లో ఎన్టీఆర్ (NTR) డ్యుయల్ రోల్ పోషిస్తున్నారని సమాచారం. తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ నటిస్తున్నాడని టాక్. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది తండ్రి పాత్ర అని తెలుస్తుంది. దీంతో యంగ్ టైగర్ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా సమయానికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ (Kalyan Ram)ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Leave a Comment