Poisoning on KA Paul?: కేఏ పాల్ పై విషప్రయోగం సోషల్ మీడియాలో ఆడియో కలకలం.

Poisoning on KA Paul


KA Paul: ప్రజాశాంతి పార్టీ(Prajashanti Party) అధినేత కేఏ పాల్(KA Paul) సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా తనను అంతమొందించేందుకు తనపై విషప్రయగం చేశారని అన్నారు.

2023 డిసెంబర్ 23 వ తేదీన తనపై విషప్రయోగం జరిగిందని ప్రకాశాంతి పార్టీ అధ్యక్షుడు పేర్కొన్నాడు. తనకు గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆహారంలో విషం కలిపి ఇచ్చారని అయితే అదృష్టవశాత్తు, భగవంతుని దయవల్ల తాను ప్రాణాలతో బ్రతికి బయటపడ్డానని చెప్పారు.

ప్రస్తుతం కేఏ పాల్ విశాఖపట్టణం(Visakhapatnam) లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

కేవలం ఈ విష ప్రయోగం కారణంగానే తాను గడిచిన పది రోజులుగా అందుబాటులోకి రాలేకపోయానని చెప్పారు. ఈ విష ప్రయోగం వల్ల తాను నరకం అనుభవించానని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మరలా ప్రజల మధ్యకు వస్తానని, యాక్టీవ్ పాలిటిక్స్ లో ఉంటానని వెల్లడించారు. అయితే దీనిపై అయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగానే,

ఎవరిమీదనైనా అనుమానం ఉన్నట్టుగానీ వెల్లడించలేదు. కేవలం తనపై విష ప్రయోగం జరిగింది అని మాత్రమే ఆరోపణ చేశారు.

కేఏ పాల్ కె ఎందుకిలా జరుగుతోంది: Why is this happening to KA Paul K?

కేఏ పాల్(KA Paul) విషయానికి వస్తే అయన అటు తెలంగాణ(Telangana) ఇటు ఆంధ్ర(Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో ఎల్లప్పుడూ కనిపిస్తూనే ఉంటారు.

ప్రతి ఎన్నికల సమయంలోను ప్రజాశాంతి పార్టీ తరుపున ఎవరో ఒక అభ్యర్ధుని నిలబెడుతూ, పాల్ హల్చల్ చేస్తూనే ఉంటారు.

అయితే అధికార పక్షం మీద లేదంటే ప్రధాన ప్రతిపక్షం మీద ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అయన కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఒకప్పుడు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్(BRS) పార్టీ పై ఆరోపణలు గుప్పిస్తూ ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి కేఏ పాల్ చెంప చెళ్లుమనిపించారు. ఆ వ్యక్తి బి.ఆర్.ఎస్ వ్యక్తి కావడం విశేషం.

కాబట్టి ఇప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ వల్ల అస్పస్థతకు గురైన పాల్ తనపై విషప్రయోగం జరిగిందని ఆరోపించి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment