Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ అందాల జాతర..అవకాశాల కోసమేనా?
మొదట్లో సన్నగా నాజూకుగా…పెళ్లైన తర్వాత బేబీ బంప్‌తో..నిన్నటి వరకు చంకలో బిడ్డను ఎత్తుకున్న టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఒక్కసారిగా గ్లామర్ క్వీన్ అవతారమెత్తింది.
మళ్లీ తనలోని పాత కాజల్‌ని పరిచయం చేస్తూ ఫ్యాన్స్ ను మరిపిస్తోంది. ఓ రేంజ్‌లో తన హాట్ అందాలతో అభిమానులను కట్టిపడేస్తోంది ఈ చిన్నది. తాజాగా కాజల్ మల్టీ కలర్ గౌన్ వేసుకుని మత్తెక్కించే చూపులతో మ్యాజిక్ చేస్తోంది.
లేటెస్ట్ అవుట్ డోర్ ఫోటో షూట్ చిత్రాలను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరిని ఫిదా చేసేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
కాజల్ అగర్వాల్ తన అందంతో, నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ అందాల చందమామ అప్పట్లో డైరెక్టర్ల ఫేవరెట్ ఛాయిస్.
అయితే తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ ను వివాహం చేసుకొని ఓ పాపకు తల్లి అయ్యిద్ది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఫ్యామీలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇక ఆల్ ఈజ్ వెల్ అనుకున్న ఈ చిన్నది ఇఫ్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.
ఓ వైపు వెబ్ సిరీస్ లు మరోవైపు సినిమాలు ఇంకో వైపు హాట్ ఫోటో షూట్లతో తన కెరీర్ ను ఎంతో ప్లాన్ గా డిజైన్ చేసుకుంటోంది. అందుకు తగ్గట్లుగా నాజూకుగా మారుతూ దర్శకుల దృష్టిని ఆకర్షించేందుకు హాట్ ఫోటో షూట్లు చేస్తోంది.
లేటెస్టుగా చేసిన ఫోటో షూట్ పిక్స్ లో కాజల్ ఎంతో గ్లామరస్ గా కనిపించింది. మల్టీ కలర్ ఫ్లోరల్ గౌనులో వింటర్ ఫ్యాషన్ పై తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ చిన్నది అందమైన అవుట్ ఫిట్ తో ఇంటర్నెట్ లో రాక్ చేస్తుంది.
కాజల్ అందాలు ఈ గౌనులో మరింత రెట్టింపు అయ్యాయి. తన లేటెస్ట్ లుక్ చూసి కాజల్ అభిమానులను ఫిదా అయిపోయారు. లైకులు ,కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఫోటోషూట్ కోసం కాజల్ అగర్వాల్ ఈ అవుట్ ఫిట్ ను పంకజ్ ఫ్యాషన్ డిజైన్స్ నుంచి ఎంచుకుంది. గులాబీ , నారింజ రంగుల కలయికతో పూల నమూనాతో ఉన్న ఈ ఆఫ్ షోల్డర్ గౌనులో కాజల్ అదరగొట్టింది.
ఈ గౌను కాజల్ చాలా అద్భుతంగా సెట్ అయ్యింది. ఈ అవుట్ ఫిట్ కు సెట్ అయ్యే విధంగా కాజల్ మేకోవర్ చేసుకుంది. మేకప్ ఆర్టిస్ట్ విశాల్ చరణ్ , కాజల్ కు ఆకర్షణీయమైన మేకోవర్ అందించాడు. స్టైలిస్ట్ రష్మీ అంగారా కాజల్ అగర్వాల్ కు స్టైలిష్ లుక్స్ అందించింది.
కాజల్ అగర్వాల్ ఈ అందాల దాడితో మళ్లీ ఇండస్ట్రీలో తన స్థానంలోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ప్రెజెంట్ లీడింగ్‌లో ఉన్న హీరోయిన్‌లకు గట్టి పోటీ ఇవ్వాలని మైండ్ లో ఫిక్స్ అయ్యింది అందుకే ఈ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో దాడి చేస్తోంది.
భగవత్ కేసరి హిట్ తో మంచి ఊపులో ఉన్న కాజల్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌హాసన్‌తో ఇండియన్-2లో నటిస్తోంది. ఈ సినిమా కోసం కాజల్ కేరళలో ప్రసిద్ధి చెందిన మార్షల్ ఆర్ట్ కలరిపట్టుని నేర్చుకుంటోంది.
ఈ విషయాన్ని స్వయంగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమాతో పాటు కాజల్ సత్యభామ మూవీ కూడా చేస్తోంది. మరి ఈ రకంగా అందాలతో దాడి చేస్తుంటే డైరెక్టర్లు మాత్రం ఏంచేస్తారు ఇలా డైరెక్ట్ గా ఆఫర్లు ఇచ్చేస్తారు మరి.