కాకమీదున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు – పెట్రోల్ బాటిళ్లతో నిరసన : Kakateeya University Students protest With Petrol Bottles

website 6tvnews template 2024 02 01T172615.390 కాకమీదున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు - పెట్రోల్ బాటిళ్లతో నిరసన : Kakateeya University Students protest With Petrol Bottles

Kakateeya University Students protest With Petrol Bottles : కాకతీయ యూనివర్సిటీలోని(Kakateeya University) వీసీ చాంబర్‌లో బీఈడీ విద్యార్థులు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఉదయం ఆందోళనకు దిగారు. విద్యార్థులు పెట్రోల్ బాటిళ్లను చేతబూని నిరసనకు చేపట్టడం తో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

విద్యాసంవత్సరం పూర్తి ముగిసినప్పటికీ టీసీలు ఇవ్వడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వెలిబుచ్చారు. యునివేర్సిటి నుండి టీసీ ఇవ్వకపోవడం వల్ల పీజీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొందని చెబుతూ తమ ఆవేదన వెలిబుచ్చారు.(Kakateeya University Students protest) పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని విద్యార్థులు ఆందోళనకు దిగారని తెలియడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

విద్యార్థులు తమ ఆందోళనను విరమించాలంటూ పోలీసులు వారించారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన చేప్పట్టడంతో ఏం క్షణం ఎం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.

కాకతీయ లో ఇది కొత్తేమీ కాదు : Protests Are Not New In kaakateeya

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇటువంటి ఆందోళనలు చేపట్టడం ఆతరువాత అవి గందరగోళ పరిస్థితులకు దారి తీయడం కొత్త కాదు. గత ఏడాది సెకండ్ క్యాటగిరి పి.హెచ్.డి ప్రవేశాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేపట్టారు విద్యార్థులు.

ఆందోళన క్రమంలో స్టూడెంట్స్ యునివేర్సిటి వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.(Kakateeya University Students protest) వీసీ తోపాటు రిజిస్టర్ తో కూడా వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది.

వీసీ, రిస్జిస్టార్, డీన్లు కలిసి 75శాతం అడ్మిషన్లను అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ఇలా ఉంటె ఈ ఏడాది మొదట్లో విశ్వవిద్యాలయం ఉద్యోగి మరణించిన నేపథ్యంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది.

Leave a Comment