Kalki2898AD Trailer :డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ..’కల్కి2898AD’ ట్రైలర్ వచ్చేస్తోంది

maxresdefault 3 Kalki2898AD Trailer :డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ..'కల్కి2898AD' ట్రైలర్ వచ్చేస్తోంది

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ తెలుగు ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki2898AD). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో వచ్చిన ‘సలార్’ (Salaar)సాలిడ్ హిట్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ (Prabhas)చేస్తున్న సినిమా ఇది. దీనితో ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin ) దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఇది.

హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్ వీడియోతో ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని హింట్ ఇచ్చింది చిత్ర బృందం. ఇక ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ (Kalki 2898 AD Trailer)రిలీజ్ డేట్ ఇదే అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ఎప్పుడంటే :

‘కల్కి2898 ఏడీ’ (Kalki2898AD) పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 22 భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ ఫిల్మ్ గా ‘కల్కి2898 ఏడీ’ సరికొత్త రికార్డ్ సృష్టించినట్లే.’కల్కి 2898 ఏడీ’ మూవీ మహాభారతంలో మొదలై 2898వ సంవత్సరంలో ఎండ్ అవుతుంది.

ఈ స్టోరీ 6వేల సంవత్సరాల మధ్య జరుగుతుందని నాగ్ అశ్విన్(Nag Ashwin )ఈ మధ్యనే ఓ ఈవెంట్ లో చెప్పాడు. ఇక కల్కి ట్రైలర్ ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుంది అని సమాచారం. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’సినిమాను మేకర్స్ మే 9వ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మూవీ రిలీజ్ కు నెల ముందు ట్రైలర్ విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

కల్కి ప్రపంచం వేరు :

సైన్స్ ఫిక్షన్ స్టోరీని తీసుకొని హాలీవుడ్ స్థాయిలో ‘కల్కి'( (Kalki2898AD)ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ . ‘బ్లేడ్ రన్నర్’ (Blade Runner )అనే హాలీవుడ్ మూవీ కి ‘కల్కి’ సినిమాకి పోలికలు ఉన్నాయని రూమర్స్ నెట్టింట్లో ఈ మధ్య బాగా వినిపించాయి. ఆ రూమర్స్ పై ఓ ఈవెంట్ లో డైరెక్టర్ క్లారిటీ కూడా ఇచ్చాడు .” కల్కి 2898 ఏడీ’ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. భారతీయ టేస్ట్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇదే స్టోరీతో గతంలో బ్లేడ్ రన్నర్ మూవీ రిలీజ్ అయ్యింది. కానీ దాని పోలికలు ఏమీ ఈ మూవీ లో ఉండకుండా జాగ్రత్త తీసుకున్నాం”అని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.

Leave a Comment