కమల్ హాసన్ ఇండియన్ 2 ఒక్క పాటకు 30 కోట్లు – ఎవ్వరు తగ్గేదేలే.

1079094 indian2 కమల్ హాసన్ ఇండియన్ 2 ఒక్క పాటకు 30 కోట్లు - ఎవ్వరు తగ్గేదేలే.

Kamal Haasan’s Indian-2 30 Crores per song : తమిళ దర్శకుడు శంకర్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన చేసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. అందులో జీన్స్, బాయ్స్ , భారతీయుడు , ఒకే ఒక్కడు, అపరిచితుడు , రోబో లాంటి భారీ సినిమాలు ఆయన లిస్టు లో ఉన్నాయి.

శంకర్ అంటేనే భారీ బడ్జెట్ సినిమాలు అనే టాగ్ ఉంది ఆయనకు. ఆయన సినిమాలోని పాటలు కూడా భారీ బడ్జెట్ తో కూడుకున్నవే. కధకి ఎంత వెయిట్ ఇస్తాడో అంతే వెయిట్ పాటలకు ఇస్తాడు. ఇప్పుడు తాజా గా కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 సీక్వెల్ కోసం ఒక పాట చిత్రీకరణ కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ పాట లో లెజెండరీ నటుడు కమల హాసన్ వేసే డాన్సు అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారని దర్శకుడు శంకర్ చెప్పారు. ఈ పాట కి ఒక ప్రత్యక సెట్ వేశామని దానికే 30 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు.

ఇప్పుడు వస్తున్న భారతీయుడు 2 మొదటి భారతీయుడు కి సీక్వేల్ అని ఆయన ఆన్నారు. ఇది చాలా కాలం నుండి నిర్మాణ దశలో ఉందని చెప్పారు. అయితే కధా పరం గా భారతీయుడు సినిమాని ఇండియన్ 2, ఇండియన్ 3 అని రెండు భాగాలుగా విభజించామని ఆయన అన్నారు.

ఇప్పుడు ఇండియన్ 2 లో టాకీ పోర్షన్ పూర్తి చేసుకుని ఒక సాంగ్ కి షూట్ ప్రారంభించామని అన్నారు. ఈ మధ్యనే ఇండియన్ 2 కోసం సిద్దార్డ్ తో పాటు ప్రియా భవాని శంకర్ లతో ఒక పాట ని కంప్లీట్ చేసామని దర్శకుడు శంకర్ చెప్పారు. ఇప్పుడు తీసే పాట కమల్ హాసన్ తో చాల గ్రాండ్ గా ఉండేలా సాంగ్ ప్లాన్ చేసామని చెప్పారు.

సంచనల మ్యూజిక్ డైరెక్టర్అ నిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాట రికార్డ్ లు తిరగరాస్తుందని ఆయన అన్నారు. ఇటీవలే అనిరుధ్ కమల్ హాసన్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్ ఎంత ఘన విజయం అందుకుందో అందరికి తెలిసిందే. మరి ఈ పాట తో ఎలాంటి మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.

Leave a Comment