Kangana Ranaut As Indira Gandhi: బాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నుండి ఏదైనా విషయం బయటకి వచ్చిందటే అది ఖచ్చితంగా సంచలనమే. ఆమె మతాల మాదిరిగానే ఆమె సినిమాలు కూడా సంచనానాత్మకంగానే ఉంటాయి.
ఆమె తన సినిమాలను వినోదంతో చేస్తోందా ? లేదంటే వివాదం తో చేస్తోందా అన్నది అర్ధంకాదు చూస్తుంటే. అందుకు తగ్గట్టు ఈమధ్య కంగన బియోపిక్స్ కూడా చేస్తోంది.
ఆమధ్య తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత(Jaya Lalitha) బయోపిక్ లో నటించిన కంగనా, ఇప్పుడు మరో బయోపిక్ తో ప్రేక్షకులను పలుకరించబోతోంది. ఈసారి ఆమె ప్రాంతీయ పార్టీ నాయకురాలి జీవిత కథతో కాకుండా ఏకంగా జాతీయ స్థాయి నాయకురాలి జీవిత కథతో ప్రేక్షకులను పలుకరించబోతోంది.
ఏకంగా ఐరన్ లేడి గా పేరు పొందిన ఇందిరా గాంధీ(Indira Gandhi) జీవిత విశేషాలతో ఒక సినిమా చేస్తోంది కంగనా. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాదు, దర్శకత్వ భాధ్యతను కూడా కంగనానే తీసుకుంది. మణికర్ణికా తరవాత ఆమె డైరెక్ట్ చేసిన సినిమా ఇదే.
1975 ఎమర్జెన్సీ విశేషాలు : 1975 Emergency Incidents
పైగా కంగనా కి ఇది చాలా ముఖ్యమైన చిత్రమని చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాకోసం తన ఆస్తిపాస్తులన్నీ తాకట్టు పెట్టిందట. అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా కంగనానే అని సెపెరేట్ గా చెప్పనవసరం అనుకుంట. సాధారణంగా అయితే ఈ మూవీ 2023 నవంబర్ లోనే విడుదల కావలసి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు.
పైగా ఈ సినిమా కోసం కంగనా చాల కష్టపడ్డారట. డెంగ్యూ ఫెవర్ వచ్చి ఒంట్లో రక్త కణాలు బాగా తగ్గిపోయి, హై ఫీవర్ ఉన్నప్పటికీ యాక్ట్ చేసిందట. ఈ సినిమాలో కంగనా ప్రేక్షకులకు 1975 నాటి ఎమర్జన్సీ తళుకు విశేషాలను చూపెట్టబోతోందట. ఈ సినిమాలో అటల్ బిహారీ వాజ్(Atal Bihari Vajpayee) పేయిగా మనకి శ్రేయాస్ తాల్పడే(Sreyas Talpade) కనిపిస్తారు, అలాగే జయప్రకాశ్ నారాయణ్(Jayaprakash Narayan) పాత్రను అనుపం ఖేర్ (Anupam Kher)ధరించారు.