సోనియా – రాహుల్ గాంధి ల మీద కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు !

website 6tvnews template 2024 04 04T171619.948 సోనియా - రాహుల్ గాంధి ల మీద కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు !

AICC అగ్రనాయకులు ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చేది సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ సీటు కోసం BJP అభ్యర్థి గా పోటీ చేస్తున్న సినీ నటి కంగనా రనౌత్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆయనకు ఆయన గా రాలేదని అసలు రాజకీయాలు అంటే ఆయనకి ఇష్టం లేదని ఆయనను బలవంతంగా రాజకీయాల్లోకి తీసుకు వచ్చిన నాయకుడిగా ఆమె వ్యాఖ్యానించారు.

తన తల్లి సోనియా గాంధీ ఆకాంక్షలకు ఆశయాలకు రాహుల్ గాంధీ బాధితుడు అయ్యాడని ఆమె ఎద్దేవా చేసారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని తల్లి బాధితుడి అని అన్నారు. ఎందుకంటే ఆయన తన ఇష్టానికి వ్యతిరేకంగా అన్ని తన తల్లిని సంతోష పెట్టడం కోసం రాజకీయ నాయకుడిగా మారాల్సి వచ్చిందని ఆమె ఆన్నారు.

అతను రాజకీయాల్లో రాణించగలడా అనేది తల్లికి ఒక అనుమానం ఉండేదని అయినా కుడా కుమారుడు ఇష్టం తో సంబందం లేకుండా రాహుల్ గాంధి మీద బలవంతంగా రాజకీయాలు రుద్దారని ఆమె విమర్శించారు. దీని వల్ల రాహుల్ గాంధి తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్నాడని అది తనకు తెలుసు అని ఆమె అన్నారు.

యాభై ఏళ్లు దాటిన కుడా రాహుల్ గాంధీ మరికొన్నేళ్లలో ఆరుపదుల వయస్సులో కి వస్తాడని . అయినప్పటికీ అతనిని పదే పదే యువ నాయకుడిగా పేరు పెట్టి పిలవడం చాలా హాస్యాస్పదం గా ఉందని ఆమె విమర్శించారు. ఆయనను ఒక రాజకీయ వారసత్వ బాధితుడిగా మాత్రమే చూడాలని అంతే కానీ దేశానికి నాయకుడు అవుతాడని పగటి కలలు కంటున్నారని ఆమె విమర్శించారు.

Leave a Comment