బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఏం మాట్లాడినా సంచలనమే. టాపిక్ ఎలాంటిదైనా, ముందుంది ఎంతటి వారైనా బెరుకు లేకుండా తన మనసులోని మాటను ముక్కుసూటిగా చెబుతుంది కంగనా. సినిమా నుంచి పొలిటికల్ వరకు ప్రతి అంశంపై నిర్మొహమాటంగా సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంది. బాలీవుడ్ క్వీన్ తాజాగా బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani) ప్రీ వెడ్డింగ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
పెళ్లి వేడుకల్లో సెలబ్రిటీలు డ్యాన్స్ చేయడంపై సెటైర్లు వేసింది. ప్రస్తుతం ఈ హాట్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చంట్ (Radhika Merchant)ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు రాజస్థాన్(Rajasthan)లోని జామ్ నగర్ (Jamnagar) లో ఎంతో గ్రాండ్ గా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ కు దేశవిదేశాల నుంచి ప్రముఖ బిజినెస్ టైకూన్లు, కంపెనీల సీఈఓలు, సింగర్స్, మ్యుజీషియన్స్, డ్యాన్సర్స్ పాల్గొన్నారు. మూడు రోజుల పాటుజరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు తళుక్కుమన్నారు.
బాలీవుడ్ తారలు హాజరుకావడమే కాకుండా వారి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో సందడి చేశారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan)మొదలు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Sharukh Khan),సల్మాన్ ఖాన్ (Salman Khan),ఆమిర్ ఖాన్(Amir Khan) వరకు దీపియా పదుకొనే (Deepika Padukone), ఆలియా భట్ (Aliya Bhatt), కియారా అద్వానీ (Kiara Advani) ఇలా దాదాపు అందరూ ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో హల్ చల్ చేశారు. ఈ పార్టీలో అమితాబ్ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
అయితే ఈ పార్టీలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut)ఎక్కడా కనిపించలేదు. మరి ఈ వేడుకకు ఆమెను పిలవలేదా..? లేక ఆమే వెళ్లలేదా..? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. సెలబ్రటీలు డాన్సులు చేయడంపై ఈ బ్యూటీ సెటైర్లు వేసింది. ” నాకు ఎంత డబ్బు ఇచ్చినా ఇలా పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేయను. ఫేమస్ సింగర్ లత మంగేష్కర్ (Latha Mangeshkar)ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఆమెను వేధించినా పెళ్లిళ్లలో, అవార్డుల వేడుకలలో ప్రదర్మన ఇవ్వలేదు. నేను అంతే . నాకు డబ్బు కంటే గౌరవం ముఖ్యం . దానినే నేను బలంగా నమ్ముతాను.
నాకు లైఫ్‌లో చాలా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ నేనెప్పుడూ పెళ్లిళ్లల్లో డ్యాన్స్ చేయలేదు. ఐటమ్ సాంగ్స్ చేయమని కూడా మేకర్స్ అడిగారు. కానీ వాటిని సున్నింతగా తిరస్కరించాను”. కంగా ఇండైరెక్టుగా అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బాలీవాుడ్ సెలబ్రిటీలు చేసిన డ్యాన్స్ పై కామెంట్ చేసింది.