Kantara First-Look Teaser Released: కాంతారా పోస్టర్ విడుదల.

Kantara first-look teaser Released

first-look teaser and poster launched:కాంతారా పోస్టర్ విడుదల


కాంతర ; చాప్టర్ 1 రిశబ్ శెట్టి దర్శకత్వంలో రాబోతున్న కన్నడ భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. 2022 కాంతర సినిమాకి సిక్వల్ ఈ కాంతర.

రిశబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన సినిమా కాంతర, ఇపుడు ఆ సినిమాకి సిక్వల్ అంటే అంచనాలు పెద్ద ఎత్తునే ఉన్నాయి. విజయ్ కిరాగందూర్, హోంబలే ఫిల్మ్స్ ఆద్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాలో రిశబ్ శెట్టి, సప్తమి గౌడ, ఊర్వశి రౌటెలా, కిశోర్, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ మరియు టీజర్ నవంబర్ 27న విడుదలయ్యింది.

టీజర్ లో ది లెజెన్డ్ వాస్ బోర్న్ అంటూ రిశబ్ శెట్టి లుక్ ని చూపించారు, రిశబ్ శెట్టి లుక్ గురించి అయితే ప్రత్యేకంగా మాటాడుకోవాల్సిందే, ఈ కథ ఒక రాజవంశపు కథ. కర్ణాటకలో నివసించే ఒక కుటుంబమైన కదంబ వంశస్థుల కథ ఇది.

రిశబ్ శెట్టి పొడవాటి గడ్డం, రుద్రాక్ష మాల, రక్తంతో తడిసిన ఒళ్ళు.. ఇదంతా ఒకెత్తు అయితే చేతిలో త్రిశూలం పట్టుకొని కళ్ళలో నిప్పులు కురిపిస్తున్న హీరో మొహం చూడాల్సిందే, ఒక్క టీజర్ ఒంటిమీద రోమాలు నిక్కబొడిపిస్తుంది. టీజర్ అంతా చీకటితో మొదలయ్యి హీరో కళ్ళలో నిప్పులతో ముగుస్తుంది.

మొదలేయినప్పటి నుంచి చివరి వరకు ఎంతో ఉత్కంట భరితంగా ఉంది. ఇది చూస్తున్న సినీప్రియులు ”ఏదో భారీగా ప్లాన్ చేశావ్ మావా” అంటూ రిశబ్ శెట్టిని తమ వాడుక భాషలో హర్షిస్తున్నారు.

ఫస్ట్ లుక్ తోనే అబిమనులందర్నీ ఆకట్టుకున్నారు. ఇంతకు ముందు కాంతర 2 గురించిన వివరాలు రిశబ్ ని అడిగినప్పుడు అసలు వివరలేవీ చెప్పలేదు, సమయం వచ్చినప్పుడు చెప్తానని దాటవేశాడు.

ఒకేసారి టీజర్ ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు పండగ చేస్కుంటున్నారు. ఈ కాంతర లెజెoడ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బంగ్లా, మరియు ఇంగ్షీషు తో కలిపి మొత్తం ఏడు భాషలలొ రాబోతుంది.

Leave a Comment