Karnataka court once again clarified about gated communities: గేటెడ్ కమ్మూనిటీల గురించి కర్ణాటక న్యాయస్థానం మరోసారి స్పష్టికరణ.

Karnataka court once again clarified about gated communities

Karnataka court once again clarified about gated communities: గేటెడ్ కమ్మూనిటీల గురించి కర్ణాటక న్యాయస్థానం మరోసారి స్పష్టికరణ

గేటెడ్ కమ్యూనిటీ అంటే అక్కడివారికే అది పరిమితం అని, అక్కడి సదుపాయాలన్నీ వారి సొంతం అని ఎప్పుడు అనుకుంటారు. అలంటి అపోహ నుంచి కర్ణాటక న్యాయస్థానం అందరిని మరోసారి బయటపడేసింది.

గత ఏడాది ఈ తీర్పు ఇచ్చినప్పటిని ఒక వ్యక్తి దీన్నీ గురించి న్యాయస్థానాన్ని మళ్ళి ప్రశ్నించాడు, దానికి న్యాయస్థానం ఇచ్చిన జవాబేంటంటే.

కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం, గేటెడ్ కమ్యూనిటీ రోడ్ల పైన ఎవరైనా ప్రయాణించవచ్చు, రాకపోకలు నిర్వహించవచ్చని స్పష్టం చేసింది. అసలు అకస్మాత్తుగా ఇచ్చిన ఈ తీర్పు

వివరాల్లోకి వెళ్తే :

బెంగళూరుకు దగ్గరలోని బెల్లందురులోని వెంకటేశ్వరా టవర్స్ గేటెడ్ కమ్యూనిటీ రోడ్ల మీదుగా వెళ్ళడానికి పక్కనే ఉన్న ఉపకార రెసిడెన్సీ వాళ్ళు ఇంతముందు ఏడాది కోర్టుని ఆశ్రయించారు.

నవంబర్ 29 2022 న కోర్టు విచారణ పూర్తి చేసి , చుట్టుపక్కల ఉన్న రోడ్లు , ఇతర వాటికీ అక్కడ ఉన్న సంస్థలు అంగీకారం తెలిపాక, అక్కడి నివాసాల యజమానులు, ప్రదేశాన్ని అభివృద్ధి చేసిన వారైనా వారికీ ఎలాంటి హక్కు ఉందని, తీర్పు ఇచ్చింది.

కానీ ఆ తీర్పు పట్ల సంతృప్తి చెందని ఒక వ్యక్తి తానుండే శ్రీ లక్ష్మి వెంకటేశ్వర టవర్స్ గేటెడ్ కమ్యూనిటీ గురించి హై కోర్ట్ డివిజన్ బెంచ్ కి వెళ్ళాడు.

ఇద్దరి వైపు అన్ని విన్న తరువాత న్యాయమూర్తులు ప్రసన్న బాలచంద్ర వరాళే, జస్టిస్ కృష్ణ, దీక్షిత్ లు గతంలో ఇచ్చిన తీర్పునే సమర్ధించింది.

ఒక్కసారి స్థానిక సంస్థల దగ్గరనుంచి అనుమతి వచ్చాక ఆ ప్రదేశంలోని రహదారులు, అక్కడి సదుపాయాలు కేవలం అక్కడివారికి మాత్రమే పరిమితం కావని, ఎవరైనా కూడా అక్కడ రాకపోకలు సాగించవచ్చని మరొక్కసారి అక్కడి ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ తీర్పునిచ్చింది.

Leave a Comment