కొడుకుని చూడగానే బావురుమన్న కవిత – కొడుకు ఏంచేశాడంటే

website 6tvnews template 2024 03 23T143321.633 కొడుకుని చూడగానే బావురుమన్న కవిత - కొడుకు ఏంచేశాడంటే

ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్, ఎక్కడ చూసినా ఇదే వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్య మంత్రి అరెస్ట్ అవ్వడం, అలాగే ఒక స్టేట్ కి తొమ్మిదిన్నరేళ్ళు సీఎం గా పనిచేసిన వ్యక్తి కుమార్తె కూడా కటకటాల పాలవ్వడం ఇందులో కొసమెరుపు.

ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇంట్లో సోదాలు చేసేందుకు వచ్చిన ఎన్ఫోర్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు ఏకంగా ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి(Delhi) తరలించుకుపోయారు. ఆమెను అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆమె సోదరుడు మాజీ మంత్రి బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అధికారులతో వాగ్వాదానికి దిగారు. తన సోదరిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈడీ అధికారులు మాత్రం వారి డ్యూటీ వారు చేసుకుంటూ వెళ్లిపోయారు. సాయంత్రం ఫ్లైట్ లో కవితను ఢిల్లీకి షిఫ్ట్ చేశారు.

అదే సీన్ రిపీట్ – Same Scene Repeat

ఆమెను ఢిల్లీకి తరలించే సమయంలో ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది. తన కుమారుడిని గట్టిగా హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యింది. ఇప్పుడు మరో మారు అదే సీన్ రిపీట్ చేశారు కవిత. లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె కుమారుడు ఆర్య(Kavitha Son Arya), ఇతర కుటుంబ సభ్యులు కలిశారు. కస్టడీలో ఉన్న కవితను ప్రతి రోజు గంట సేపు కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

WhatsApp Image 2024 03 23 at 2.09.50 PM కొడుకుని చూడగానే బావురుమన్న కవిత - కొడుకు ఏంచేశాడంటే

అనుమతులు కూడా ఉండటంతో మార్చ్ 22వ తేదీ రాత్రి సమయంలో రిమాండ్ లో ఉన్న కవితను కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. అయితే తన కుమారుడు ఆర్యను చూసిన వెంటనే కవిత నియంత్రణ కోల్పోయారు. ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయింది. ఇక కుమారుడు ఆర్య కూడా తల్లిని చూడగానే కన్నీటి పర్యంతమయ్యాడు అని సమాచారం. ఇక కవితను వారి పర్సనల్ లాయర్ మోహిత్ రావు కూడా కలిశారు. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, కోర్టులపై విశ్వాసం ఉంచుదామని కవితకు మోహిత్ రావు ధైర్యాన్ని నూరిపోసినట్టు తెలుస్తోంది.

కవితకు హై బీపీ నా – Kavitha Suffering With High Blood pressure

మరోవైపు మర్చి 23వ తేదీతో కవిత ఈడీ కస్టడీ ముగుస్తోంది. కాబట్టి మధ్యాహ్నం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో(CBI Special Court) కవితను ఈడీ అధికారులు ప్రవేశ పెట్టనున్నారు. కవితను మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారట.

అయితే కవిత తరుపు న్యాయవాదులు, ఈడీ తరుపు న్యాయవాదులు కోర్టు లో వాదోపవాదాలు వినిపించగా న్యాయమూర్తి చివరగా కవితకు మరో మూడు రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపింది. ఇక ఈ విషయం ఇలా ఉంటె కవిత విచారణలో ఈడీ అధికారులకు సహకరించడం లేదని ఈడీ అధికారులు కోర్టు లో తెలిపినట్టు తెలుస్తోంది. మరోవైపు కవిత ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమె హైబీపీతో బాధపడుతున్నారని చెబుతూ ఆమె తరుపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Leave a Comment