కవితకు సుప్రీం కోర్టు మొట్టికాయలు – బెయిల్ విషయం లో అయోమయం !

1426355 kavitha కవితకు సుప్రీం కోర్టు మొట్టికాయలు - బెయిల్ విషయం లో అయోమయం !


ఇటీవల మద్యం కేసులో అరెస్ట్ అయిన BRS పార్టీ నాయకురాలు కవిత వేసిన పిటీషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విహారణకు స్వీకరించింది. ఇంతకుముందు ఇదే విషయం పై వేసిన పిటీషన్ తో కలిపి విచారణ చేస్తామని తెలిపిన అనంతరం బెయిల్ గురించి అయితే ట్రయల్ కోర్టు కి వెళ్ళాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయ పడింది. అయితే పిటీషన్ లో పేర్కొన్న అంశాలపై ED నోటీసులు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రస్తుతం కేసు దుర్యాప్తు లో ఉన్న కారణం గా కేసు మెరిట్స్ లోకి వెళ్ళడం కుదరదు అని కోర్టు స్పష్టం చేసింది.

కవిత పేర్కొన్నట్లు పలు అంశాల పై ED కు కూడా నోటీసులు జారీ చేసింది కోర్టు. అయితే కవిత బెయిల్ అప్పీల్ కోసం వెళ్ళాలి అనుకుంటే ట్రయల్ కోర్ట్ కు వెళ్ళడానికి ఆమెకు ఆ స్వేఛ్చ ఉంటుందని కోర్టు తెలిపింది. అంతే కాదు కవిత పిటీషన్ అంశాలపై 6 వారల సమయం లో ED సమాధానం చెప్పాలని ఆదేశాలు ఇస్తూ కోర్టు తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది.

Leave a Comment