కవితకి కోర్టు లో చుక్కెదురు, బెయిల్ తీర్పు రిజర్వ్ – సంచనల వ్యాఖ్యలు చేసిన కవిత

Screenshot 2024 03 27 115247 కవితకి కోర్టు లో చుక్కెదురు, బెయిల్ తీర్పు రిజర్వ్ - సంచనల వ్యాఖ్యలు చేసిన కవిత

దేశ రాజకీయాలను ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఒక కుదుపు కుదుపింది. రోజు రోజుకి రాజకీయాలు వేడిక్కిస్తునాయి అనే చెప్పాలి. ఒక పక్క పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండగా మరో పక్క పార్టీ లోని కీలక సబ్యులను అరెస్ట్ చేసుకుంటూ పోతోంది. చిన్న లీడర్లు దగ్గర నుండి CM ల దాక ఎవరిని ED విడిచిపెట్టలేదు. ఈ కేసుతో సంబందం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామని ED కూడా ప్రకటించింది. ఈరోజు తో BRS పార్టీ నాయకురాలు కవిత కస్టడి పూర్తి అవ్వడం తో రూస్ ఆవెన్యు లో హాజరు పరిచారు. ఇదే సమయం లో కవిత కొన్ని సంచలన ఆరోపణలు చేసారు.

కవిత మాట్లాడుతూ ఇదేమి మనీ లాండరింగ్ కేసు కాదు అని దీనిని పొలిటికల్ లాండరింగ్ అంటారని ఆమె అన్నారు. తనకు ఉన్న ఆత్మస్దైర్యం ను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ కొట్టలేరని ఆమె అన్నారు. తొందర్లోనే స్వచ్చమైన ముత్యం లా బయటకి వస్తాను అని ఆమె అన్నారు. అంతే కాదని ఒక నిందుతుడు వచ్చి BJP చేరాడని, ఇంకో నిందుతుడుకి అయితే ఏకంగా BJP నుండి టికెట్ లభించిదని అంటూ ఆమె తీవ్ర విమర్శలు చేసారు. ఒక నిందితుడు 50 కోట్లు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్ లను BJP డబ్బులు రూపం లో ఇచ్చాడని ఆమె వ్యాఖ్యలు చెయ్యడం పెద్ద దుమారం లేచింది.

అయితే కోర్టు కు వచ్చిన ఆమె తన కుమారుడికి పరిక్షలు ఉండండం వల్ల తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వమని కవిత తరపున లాయర్లు పిటీషన్ వేసారు. దీని మీద వివరణ ఇవ్వడం కోసం ED కొంత సమయం కావాలని కోరింది. దీని వల్ల తన తీర్పు ను రూస్ అవెన్యూలో రిజర్వ్ లో పెడుతున్నట్లు కోర్టు తెలిపింది.

Leave a Comment