ఆ ఇద్దరికీ టికెట్లు ఖరారు – వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్

website 6tvnews template 2024 03 23T125753.232 ఆ ఇద్దరికీ టికెట్లు ఖరారు - వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్

దేశం మొత్తం మీద రాజకీయాలు ఒకలా ఉంటె తెలంగాణ రాజకీయాలు(Telangana Politics) మరోలా ఉంటాయి. ఇక్కడి రాజకీయాలు చూసేవారికి రసవత్తరంగా, రంజుగా ఉంటాయి. శాసనసభ ఎన్నికల సమయంలో కూడా అదే తీరు జోరు కనిపించింది. ఆ ఎన్నికల్లో కూడా తెలంగాణ ఓటర్లు ఎప్పటిలానే తమ వైవిధ్యమైన ఓటింగ్ తీరును కనబరిచి విజ్ఞతను చాటుకున్నారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు(parliament Elections) దగ్గర పడ్డాయి.

దేశ వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) వెలువడటంతో వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రతిపక్ష బి.ఆర్.ఎస్(BRS) కూడా పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేస్తోంది. గతంలో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని గులాబీ బాస్ ఈ ఎన్నికలకు అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు కారు పార్టీ ఎంపీ టికెట్ లను ఖరారు చేసింది. బీఆర్ఎస్ అధినేత మర్చి 22వ తేదీన మరో ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లను అనౌన్స్ చేశారు.

WhatsApp Image 2024 03 23 at 12.53.38 PM 1 ఆ ఇద్దరికీ టికెట్లు ఖరారు - వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్

వారిలో నాగర్ కర్నూల్(NagarKarnool) నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar), మెదక్(Medak) నుంచి వెంకట్రామిరెడ్డి(Venkat Rami Reddy) ఉన్నారు. ప్రవీణ్ కుమార్ ఈ మధ్యనే బహుజన్ సమాజ్ పార్టీకి(Bahujan Samaj Party) బై బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. కాబట్టి గులాబీ దళపతి ఈ సారి ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి తోపాటు ప్రవీణ్ కుమార్ కు కూడా చాన్స్ ఇచ్చారు. అయితే ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ ఇద్దరూ కూడా మాజీ సివిల్ సర్వెంట్లే(Ex Civil Servents).

ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇద్దరు ఆల్ ఇండియా మాజీ ఆఫీసర్లు బీఆర్ఎస్ టికెట్‌పై లోక్ సభ ఎన్నికల బరిలో నిలువబోతున్నారు అని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న తమ అధ్యక్షులు కేసీఆర్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌, మెదక్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ ఇద్దరిని ప్రజలు గెలిపించి పార్లమెంట్‌కు పంపుతారనే నమ్మకం విశ్వాసం తనకు ఉందన్నారు.f

Leave a Comment