నేడు KCR కరీంనగర్ పర్యటన – రైతులతో చర్చలు

website 6tvnews template 2024 04 05T121137.569 నేడు KCR కరీంనగర్ పర్యటన - రైతులతో చర్చలు

ఇటీవల KCR ఉమ్మడి నల్లగొండ జిల్లాను పర్యటించడం జరిగింది. ఆ సమయంలో ఆయన పలువురు రైతులను కలుసుకున్నారు. కాసేపు వాళ్ళతో ముచ్చటించారు, అలాగే వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన కరీమ్ నగర్ ను సందర్శించ బోతున్నారని వార్తలు అందుతున్నాయి. అలాగే కరీంనగర్ లో ఎండిన పంటలను ఆయన పరిశీలిస్తారని BRS నేతలు చెప్పారు. మొగ్దుంపూర్ లో కుడా ఎండిన పంటలను ఆయన పరిశీలన తర్వాత రైతులతో చర్చలలో పాల్గొంటారని నేతలు చెప్తున్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు డీ-93 పరిధిలో ఉన్న మొగ్దుంపూర్‌లో యాసంగిలో సాగుచేసిన పంటలు దాదాపు 60% ఎండి పోయాయి అక్కడి రైతులు చెప్తున్నారు. కాల్వ మొదట్లోనే ఉన్న ఇలాంటి భూములు కూడా నీళ్ళు అందక ఎండిపోవడం చాలా భాధాకరం అని ఆయన చెప్పారు. ఇక ఆయకట్టులో ఉన్న చివరి భూముల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఊరు రైతులు తీవ్ర ఆవేదన ఆందోళన లో ఉండడం వలన వారిని పరామర్శించేందుకు కేసీఆర్ ఈరోజు కరీంనగర్ వెళ్తున్నట్లు BRS పార్టీ శ్రేణులు చెప్పారు.

ఆయన ఈరోజు ఉదయం 8:30 గంటల సమయం లో సిద్దిపేట జిల్లాలో ఉన్న ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి నేరుగా బయలుదేరి 10:30 గంటలకు కరీంనగర్‌ లో ఉన్న మొగ్దుంపూర్‌కు చేరుకుంటారని ఆయన పార్టీ నేతలు చెప్పారు. KCE పంటలను పరిశీలించిన తర్వాత రైతులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే మధ్యాహ్నం 1.00 గంటకు కరీంనగర్‌లో ఉన్న MLA గంగుల కమలాకర్‌ రెడ్డి నివాసంలో ఆయన భోజనం చేస్తారు. అక్కడి నుంచి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లికి వెళ్తారని నాయకులు చెప్పారు.

అక్కడ కుడా ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత అక్కడి రైతులతో కుడా మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటలకు శాభాష్‌పల్లి వంతెనపైకి చేరుకొని మిడ్ మానేరు డ్యాం పరిశీలిస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ భవన్‌కు చేరుకొంటారు. అలాగే కొద్దిసేపు అనంతరం మీడియాతో మాట్లాడతారు. అక్కడి నుంచి మళ్ళి నేరుగా ఎర్రవల్లిలో ఉన్న వ్యవసాయక్షేత్రానికి చేరుకుంటారని పార్టీ నాయకులు చెప్పారు.

Leave a Comment