KCR bone injury : కేసీఆర్ తుంటి ఎముకకి గాయం..అసలు కారణం ఏమిటంటే..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కాలికి గాయం అయింది. అర్ధరాత్రి సమయంలో ఆయన కాలుజారి కిందపడిపోయారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయిన నాటి నుండి కూడా ఆయన ఎర్రవెల్లి లోని ఫార్మ్ హౌస్ లో ఉన్నారు. డిసెంబర్ మూడవ తేదీన భారాస ఓటమిపాలైంది అని వార్తా తెలిసిన నాదే అయన ప్రగతి భవన్ ను విడిచి పెట్టి తన ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు.
తనను కలిసేందుకు వచ్చిన వారిని కూడా కేసీఆర్ అక్కడే మీట్ అవుతున్నారు. ఇక పార్టీ కార్యకలాపాలు, ఎమ్మెల్యే లతో సమావేశాలు, సమీక్షలు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే జరుగుతున్నాయి. బిఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు.
అయితే గత అర్ధ రాత్రి కేసీఆర్ బాత్ రూమ్ లో వెళ్లిన సమయంలో కాలు జారీ కింద పడిపోయారు. గమనించిన సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.
కేసీఆర్ ను పరీక్షించిన వైద్యులు ఆయన తుంటికి గాయమైందని వెల్లడించారు. కేసీఆర్ తుంటిని సరిచేసేందుకు శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు.
తుంటి మినహా ఆయన ఆరోగ్య పరిస్థితి మొత్తం నిలకడగానే ఉందన్నారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావు ఆఘమేఘాల మీద ఆసుపత్రికి చేరుకున్నారు. యశోద వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్యం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇక వైద్యులు కూడా కేసీఆర్ కి అవసరమైన మేరకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని చెప్పారు.