keedaa Cola : పక్కా పైసా వసూల్ సినిమా గా కీడా కోలా ఎలా నిలిచింది..కీడా కోలా అనే టైటిల్ అప్ట్ అయ్యిందా ?

Add a heading 2 1 keedaa Cola : పక్కా పైసా వసూల్ సినిమా గా కీడా కోలా ఎలా నిలిచింది..కీడా కోలా అనే టైటిల్ అప్ట్ అయ్యిందా ?

keedaa Cola : పక్కా పైసా వసూల్ సినిమా గా కీడా కోలా ఎలా నిలిచింది..కీడా కోలా అనే టైటిల్ అప్ట్ అయ్యిందా ?

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కీడా కోలా, ఈ సినిమాలో డైరెక్టర్ తరుణ్ ప్రధాన పాత్రను పోషించాడు కూడా. తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. అసలు ఈ సినిమాకి కీడా కోలా అని పేరెందుకు పెట్టారు అంటే, మర్డర్ కేసులో నాయుడు(తరుణ్ భాస్కర్) జైలులో జీవిత ఖైదు అనుభవించి విడుదలవుతాడు.

తనకి తన తమ్ముడు జీవన్ నాయుడుకి ఒకటే లక్ష్యం నాయుడు కొర్పొరేటర్ అవ్వాలి. మరి కొర్పొరేటర్ అవ్వాలంటే కోటి రూపాయలు కావాలి. తేలికగా కోటి రూపాయలు సంపాదించడం కోసమే వారు కీడా కోలాలో బొద్దింకను వేస్తారు. వీరి విషయం పక్కన పెడితే వాస్తు(చైతన్య రావు) కి తల్లిదండ్రులు లేకపోవడంతో తన తాతయ్య దగ్గర పెరుగుతాడు.

అయితే నాయుడు బొద్దింక వేసిన కీడా కోలా వాస్తు చేస్తికి దక్కుతుంది. కోర్టు కేసులో ఉన్న వాస్తు ఈ కీడా కోలా తన చేతికి రావడంతో తన స్నేహితుడు లాయర్ కౌశిక్ తో కలిసి ఆ కీడా కోలా ఓనర్ ను బ్లాక్ మెయిల్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేయాలనుకుంటాడు.

అసలు వాస్తుకి ఉన్న కోర్ట్ కేసు ఏంటి, దివ్యానంగుడిగా వాస్తు ఎలా మారాడు, కోర్ట్ లో వాస్తును కోటి రూపాయలు కట్టమని ఎందుకు తీర్పు వప్పింది. నాయుడు కి వాస్తు కి లింకేంటి ? మరి కోటి రూపాయలు వాస్తుకి దక్కాయా నాయుడికి దక్కాయా అన్నది తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే.

ezgif 3 ffbbf67dc4 keedaa Cola : పక్కా పైసా వసూల్ సినిమా గా కీడా కోలా ఎలా నిలిచింది..కీడా కోలా అనే టైటిల్ అప్ట్ అయ్యిందా ?

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, చైతన్యరావు , బ్రహ్మానందం, రఘురాం, జీవన్ కుమార్, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్, గెటప్ శ్రీను తదితరులు నటించారు,
సాంకేతిక నిపుణులు చూస్తే వివేక్ సాగర్ * సంగీతం, ఏజే ఆరోన్ – సినిమాటోగ్రఫి, ఉపేంద్ర వర్మ – ఎడిటింగ్, ఆశీష్ తేజ పులాల – ఆర్ట్ ను చేశారు. సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్ లు ఈ సినిమాను నిర్మించారు.

సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కధలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ, పాత్రలను ఎస్టాబ్లిష్ చేస్తూ వెళుతుంది. చూసే వారికి ఏంటి ఇది అసలు కథ ఎప్పుడు మొదలవుతుంది అన్న సందేహం కలుగుతుంది. అయితే మొదటి హాఫ్ లో అనుకున్నంత సాగదీత ఉండదు, ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా అక్కడక్కడా కొంచం ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుండి కధలో జోరు మొదలవుతుంది. నటీనటుల హావభావాలు, పాత్రలు ప్రవర్తించే విధానం కడుపుబ్బా నవ్విస్తాయి.

తరుణ్ భాస్కర్ సినిమా ఫంక్షన్ లో ఎంత హిలేరియస్ గా మాట్లాడతాడో అంతకు పది రేట్లు హాస్యాన్ని ఈ సినిమా సన్నివేశాల్లో గుప్పించాడు. పైగా తరుణ్ కూడా అదిరిపోయే రేంజ్ లో కామెడీని పండించాడు. వాస్తు బిజినెస్ చేసే బొమ్మతో నాయుడు ప్రేమలో పడటం కామెడీతో ఆలరిస్తుంది. బ్రహ్మానందం సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నటీనటులు అందరు కూడా వారి వారి పాత్రలలో జీవించి సినిమా విజయానికి తమ వంతు కృషిని అందించారు. ఇక నటీనటుల ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటే, ఆ హావభావాలకి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యుజిల్ మరింత బలాన్ని ఇచ్చింది. ఫన్, యాక్షన్, సెటైరికల్ కామెడీతో అలరించిన ఈ సినిమా ప్రేక్షకులకు పైసా వసూల్ సినిమా గా నిలిచింది అంటున్నారు చూసిన వారు.

Leave a Comment